Hyderabad: ఇక నుంచి తెలంగాణదే హైదరాబాద్..
తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఎంత మంది ప్రాణాలు అర్పించారు. చివరికి తెలంగాణ ఆవశ్యకతను గుర్తించిన కాంగ్రెస్.. ఏపీలో కాంగ్రెస్ నాశనమైపోతుందని తెలిసినా తెలంగాణ ప్రకటించింది. అయితే హైదరాబాద్ ను పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేసింది. పదేళ్లు నిన్నటితో ముగిశాయి.
ఇక నుంచి తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ మనదే కానుంది. దీంతో ఎలాంటి విభజన సమస్యలు లేని హైదరాబాద్ లోని భవనాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. పదేళ్లు ఉమ్మడి రాజధాని ప్రకటించినా ఏపీ ప్రభుత్వం మాత్రం 2016-17లోనే అక్కడికి షిఫ్ట్ అయింది. అయినప్పటికీ హైదరాబాద్ జూన్ 1, 2024 వరకు ఉమ్మడి రాజధానిగా కొనసాగింది.

హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆయా శాఖల పరిధిలో ఉన్న భవనాలన్నీ తెలంగాణకు చెందనున్నాయి. కాగా, హైదరాబాద్ లోని కొన్ని భవనాలను ఇంకొంతకాలం కంటిన్యూ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరినట్లు తెలిసింది. అయితే దీనిపై తెలంగాణ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. విభజన చట్టంలో చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నందున పునర్విజన చట్టాన్ని సవరించి, ఇంకొంత కాలం టైమ్ ఇవ్వాలని ఏపీ కోరినట్లు సమాచారం.
చరిత్ర చూసుకున్నట్లైతే ఒక్కప్పుడు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది. హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17 భారత్ లో విలీనం అయింది. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంగా ఉంది. 1956లో మద్రాస్ నుంచి విడిపోయిన ఏపీని తెలంగాణకు కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. ఈ కలయికను అప్పటి నుంచి తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. చివరకు తిరిగి స్వరాష్ట్రం సాధించుకున్నారు.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications