వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"టోలు" తీస్తారు - రేపటి నుంచి కొత్త ధరలు : ఆ హైవే మినహా - దేనికి ఎంత మేర..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

హైవే మీదకు వెళ్లారా. "టోలు" తీయటానికి రెడీగా ఉన్నారు. టోల్‌ ప్లాజాల్లో చార్జీలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టోల్‌ ప్లాజాలు ఎత్తివేస్తూ కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. కొనసాగుతున్న వాటి వద్ద మాత్రం భారీగా వసూళ్లకు రంగం సిద్దమైంది. కొత్త ఆర్దిక సంవత్సరం (రేపటి నుంచి) పెరిగిన ఛార్జీలు వసూలు చేయనున్నారు. హైదరాబాద్‌-బెంగళూరు హైవే మినహా మిగతా టోల్‌ ప్లాజాల రుసుములను ఎన్‌హెచ్‌ఏఐ సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. సవరించిన ధరల మేరకు కార్లు, జీపులు లాంటి వాహనాలకు 5 నుంచి 8 శాతం, లైట్‌ కమర్షియల్‌ వాహనాలకు 10 నుంచి 15 శాతం, బస్సులు, ట్రక్కులకు 10 నుంచి 15 శాతం చార్జీలు పెరిగాయి. ఆయా కేటగిరీల్లో రూ. 5 నుంచి 50 వరకు ధరలు పెరిగాయి.

పెంపుకు ప్రాతిపదికలు ఇవే

పెంపుకు ప్రాతిపదికలు ఇవే

టోల్‌ గేట్ల సామర్థ్యం, నిర్వహణ వ్యయం..రోడ్ల నిడివి..వంటి అంశాల ఆధారంగా టోల్ ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ ఏటా కొత్త ఆర్దిక సంవత్సరం ప్రారంభం నాటికి ధరల సవరణ సాధారణమే అని అధికారులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలోనే ఆర్టీసీ అన్ని బస్సులకు కలిపి ఒకేసారి ఆర్టీసీ టోల్‌ రుసుములను చెల్లిస్తుంది. గత నాలుగేళ్లుగా టోల్‌ రుసుములను సంస్థ సవరించలేదు. గత ఏడాది కాలంలో ప్రయాణికుల నుంచి వసూలు చేసిన మొత్తం కంటే టోల్‌ నిర్వాహకులకు చెల్లించిన మొత్తం రూ.8 కోట్లు ఎక్కువని ఇటీవల గుర్తించారు. ఈ మేరకు వారం క్రితం ఆర్టీసీ కూడా టికెట్‌ రేట్లలో టోల్‌ వాటాను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇలా

పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇలా

ఇక, సవరించిన ధరల మేరకు చూస్తూ.. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పైన లైట్‌ కమర్షియల్‌ వెహికిల్స్‌ సింగిల్‌ ట్రిప్‌ ఛార్జి రూ.130 నుంచి రూ.140కి, రిటర్న్‌ జర్నీ రూ.190 నుంచి రూ.210కి, నెలపాస్‌ రూ.4255 నుంచి రూ.4685కు పెరిగాయి. బస్, ట్రక్కుల సింగిల్‌ ట్రిప్‌ రూ.265 నుంచి రూ.290కి, రిటర్న్‌ జర్నీ ఛార్జి రూ.395 నుంచి రూ.435కు, నెల పాస్‌ రూ.8795 నుంచి రూ.9685కు, ఓవర్‌సజ్డ్‌ వెహికిల్‌ సింగిల్‌ ట్రిప్‌ రూ.510 నుంచి రూ.560కి, రిటర్న్‌ జర్నీ రూ.765 నుంచి రూ.845కు, నెలపాస్‌ రూ.17010 నుంచి రూ.18740కి పెరిగాయి. కారు, జీపు వ్యాన్‌ ఇతర లైట్‌ వెహికిల్స్‌కు సింగిల్‌ ట్రిప్‌ ఛార్జి రూ.80 నుంచి రూ.90కి, రిటర్న్‌ జర్నీతో కలిపి ఛార్జి రూ.120 నుంచి రూ.135కు, నెల పాస్‌ ఛార్జి రూ.2690 నుంచి రూ.2965కు పెంచుతూ నిర్ణయించారు.

చిల్లకల్లు గేట్ దగ్గర కొత్త ధరలు

చిల్లకల్లు గేట్ దగ్గర కొత్త ధరలు


ఇక, చిల్లకల్లు టోల్ గేట్ వద్దర జీపు కార్ల సింగిల్‌ ట్రిప్‌ రూ.90 రూ.100, రిటర్న్‌ జర్నీ ఛార్జి రూ.135రూ.150, నెలపాస్‌ రూ.3040రూ.3350, లైట్‌ కమర్షియల్‌ వెహికిల్స్‌ సింగిల్‌ ట్రిప్‌ రూ.145రూ.160, రిటర్న్‌ జర్నీ రూ.215రూ.240, నెల పాస్‌ రూ.4805రూ.5290, బస్సు, ట్రక్కు సింగిల్‌ ట్రిప్‌ రూ.300రూ.330, రిటర్న్‌ జర్నీ రూ.445రూ.490, నెల పాస్‌ రూ.9930రూ.10940, ఓవర్‌సైజ్డ్‌ వెహికిల్స్‌ సింగిల్‌ ట్రిప్‌ రూ.575రూ.635, రిటర్న్‌ జర్నీ రూ.865రూ.955, నెల పాస్‌ రూ.19215రూ.21170 గా నిర్ణయించారు. దీంతో..ఇప్పటికే పెట్రో ధరల పెంపుతో..వాహన నిర్వహణ భారంగా మారుతున్న వేళ.. ఇప్పుడు టోలు ప్లాజాల్లో ధరలు పెంచటంతో ఇక వాహనదారులకు భారం తప్పేలా లేదు.

English summary
NHAI hike the toll plaza's fee on national hiways from April 1st on wards. Based on traffic and mainatainance decided the rates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X