Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పర్సనల్ విషయాలు మీకెందుకు?: సిట్‌కు చార్మి కౌంటర్

టాలీవుడ్ సినీ నటి చార్మిని ఆరుగంటలపాటు ప్రశ్చించిన సిట్ అధికారులకు పెద్దగా ఉపయోగం లేదని తేలింది.

హైదరాబాద్: టాలీవుడ్ సినీ నటి చార్మిని ఆరుగంటలపాటు ప్రశ్చించిన సిట్ అధికారులకు పెద్దగా ఉపయోగం లేదని తేలింది. ప్రతి విషయానికి ఆమె తాను రాసుకొన్న స్క్రిప్ట్ ప్రకారంగానే వ్యవహరించిందనే అభిప్రాయాలను సిట్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకాక్ బ్యాచ్‌లో ఉన్నారా అంటూ సిట్ అదికారుల ప్రశ్నలకు ఆమె తెలియదనే సమాధానమిచ్చారని తెలుస్తోంది.

పరుసగా సిట్ అధికారులు సినీ ప్రముఖులను విచారిస్తున్నారు. బుదవారం నాడు సిట్ అధికారులు చార్మిని ఆరుగంటలపాటు ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ అధికారులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించారు.

అయితే సిట్ విచారణకు వచ్చే సమయంలో కంటే వెళ్ళే సమయంలోనే చార్మి చాలా హుషారుగా కన్పించారు. విచారణ నుండి తిరిగి వెళ్ళే సమయంలో ఆమె మీడియా ప్రతినిధులకు చేయి ఊపుతూ నవ్వుతూ ఉల్లాసంగా కన్పించారు.

అయితే ఈ విచారణలోఆశించిన ప్రయోజనం కన్పించలేదనే అభిప్రాయపడుతున్నారు సిట్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే అవసరమైతే మరోసారి విచారణకు పిలిస్తే రావాలని కూడ వారు ఆదేశించారు. అయితే దీనికి కూడ ఆమె సానుకూలంగా స్పందించారని సిట్ అధికారులు తెలిపారు.

బ్యాంకాక్ బ్యాచ్‌‌లో ఉన్నారా?

బ్యాంకాక్ బ్యాచ్‌‌లో ఉన్నారా?

టాలీవుడ్ సినీ నటి చార్మిని కెల్విన్‌తో సంబంధాలపై ప్రధానంగా ప్రశ్నించారని సమాచారం. కెల్విన్‌తో పరిచయమున్న బ్యాంకాక్ బ్యాచ్‌లో ఉన్నారా అంటూ చార్మిని సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ సహ ఇతరులతో చార్మి సంబంధాలపైనే వారు ఆరా తీశారని సమాచారం. అయితే ఈ విషయమై ప్రతి ప్రశ్నకు ఆమె కూడ పెద్దగా సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. తాను అనుకొన్న మేరకు వ్యవహరించారని తెలిసింది.. అనుకొన్న స్క్రిప్ట్ ప్రకారంగానే ఆమె సిట్ అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చారని సమాచారం.ఎక్కువ ప్రశ్నలకు తనకు ఏమీ తెలియదనే సమాధానం చార్మి నుండి వచ్చిందని అధికారులు అంటున్నారు.

పర్సనల్ విషయాలు మీకెందుకు అంటూ..

పర్సనల్ విషయాలు మీకెందుకు అంటూ..

తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఎందుకు ప్రశ్నిస్తున్నారని చార్మి ఒకానొక దశలో సిట్ అధికారులకే కౌంటర్ ఇచ్చింది. కుటుంబ విషయాలతో పాటు సినిమాల్లోకి ఎలా ప్రవేశించారనే విషయాలను ప్రశ్నిస్తూ అసలు ప్రశ్నలను అడిగారని సమాచారం. అయితే ఈ సమయంలోనే ఆమె సిట్ అధికారులకు కౌంటర్ ప్రశ్నలు వేశారు. పర్సనల్ విషయాలను గురించి ప్రశ్నించాల్సిన అవసరాన్ని ఆమె ప్రశ్నించారు.

వీడియోలను చూపిన సిట్ అధికారులు

వీడియోలను చూపిన సిట్ అధికారులు

కెల్విన్ గురించి సమాచారాన్ని సేకరించేందుకు సిట్ అధికారులు ఆమెను పలు రకాల ప్రశ్నలతో సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. కెల్విన్ ఫోన్‌లో మీ గురించి చార్మి దాదా అనే పేరుతో ఫీడ్ చేసుకొన్న విషయాన్ని సిట్ అధికారులు ప్రస్తావించారు.అయితే ఈ విషయమై తన ఫోన్ నెంబర్ కెల్విన్ ఫోన్‌లో లేదని చార్మి చెప్పారు. అంతేకాదు కొన్ని వీడియో క్లిప్పింగ్‌లను చార్మికి సిట్ అధికారులు చూపారు. అయితే ఈ క్లిప్పింగ్‌లను చూసిన చార్మి తనకు డ్రగ్స్ అలవాటు లేదని తేల్చి చెప్పారు.

కెల్విన్ అలా..చార్మి ఇలా

కెల్విన్ అలా..చార్మి ఇలా

డ్రగ్స్ కేసు విషయమై ప్రధాన నిందితుడు కెల్విన్ చార్మి గురించి కీలక సమాచారాన్ని ఇచ్చారని సిట్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయాలను ఆధారంగా చేసుకొని ప్రశ్నించిన సిట్ అధికారులకు చార్మి నుండి పెద్దగా సమాచారం లేదని తేలింది. కెల్విన్‌తో తనకు సంబంధం లేదని ఆమె తేల్చి చెప్పారు. అయితే కెల్విన్‌తో చార్మి దిగిన ఫోటోను సిట్ అధికారులు ఆమె ముందుంచి ప్రశ్నించారు. అయితే జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్ సందర్భంగా పోటో దిగినట్టు అధికారులు ఆమె దృష్టికి తీసుకెళ్ళారని సమాచారం. కానీ, ఈ సమాధానంతో చార్మి ఏకీభవించలేదని తెలిసింది.

విచారణకు శిక్షణతో వచ్చిన చార్మి

విచారణకు శిక్షణతో వచ్చిన చార్మి

సిట్ విచారణకు వచ్చే సమయంలోనే చార్మి శిక్షణ తీసుకొని వచ్చినట్టుగా అన్పించిందని సిట్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పొడిపొడిగానే ఆమె సమాధానాలను ఇచ్చారని అధికారులు చెప్పారు. ఎక్కువ ప్రశ్నలకు ఆమె నుండి తెలియదనే సమాధానాలు వచ్చాయని అధికారులు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+