శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు...లైంగికంగా వేధించిన ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు..?

Recommended Video

    జీవన్ రెడ్డి పై శ్రీరెడ్డి వ్యాఖ్యలు

    సినిమా ఇండస్ట్రీని ఊపేసిన క్యాస్టింగ్ కౌచ్ అంశం ఈ సారి పొలిటికల్ సర్కిల్స్‌ను అంటుకుంది. ఇప్పటి వరకు చాలామంది తనను లైంగికంగా వేధించారని చెప్పుకుంటూ పలువురి ప్రముఖుల పేర్లను వెల్లడించిన నటి శ్రీరెడ్డి తాజాగా రాజకీయనాయకుల పేర్లను కూడా బయటపెట్టింది. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి ఈ పేర్లను ప్రస్తావించింది. తన దగ్గర ఇంకా చాలామంది ప్రముఖలు పేర్లు ఉన్నాయని ఆమె తెలిపింది.

    ఇక క్యాస్టింగ్ కౌచ్ అంశం ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీకే పరిమితం కాగా శ్రీరెడ్డి బయటపెట్టిన వ్యక్తులపేర్లతో అది కాస్త పొలిటికల్ సర్కిల్స్‌కు తాకింది. తాజాగా శ్రీరెడ్డి ఓ యువ ఎమ్మెల్యే పేరును ప్రస్తావించింది. శ్రీరెడ్డిని లైంగికంగా వేధించిన వారిలో ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ విషయాన్ని శ్రీరెడ్డి తనే స్వయంగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. జీవన్ రెడ్డి తనను చాలా సార్లు లైంగికంగా వేధించాడని ఆమె పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీరెడ్డి ఆరోపణలు విపక్షాలకు ఆయుధాలుగా మారనున్నాయి.

    Tollywood actress Sri Reddy says TRS MLA Jeevan Reddy had sexually accused her

    ఎప్పుడూ గట్టిగా ధైర్యంగా టీఆర్ఎస్ తరపున పలు టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే జీవన్ రెడ్డిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా టీఆర్ఎస్, ఆర్మూర్ ప్రజల్లో అంశం చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డి కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అని కూడా టీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటూ ఉంటాయి.

    Tollywood actress Sri Reddy says TRS MLA Jeevan Reddy had sexually accused her

    ఇదిలా ఉంటే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలామంది పేర్లు తనదగ్గర ఉన్నాయని శ్రీరెడ్డి చెప్పింది. అయితే శ్రీరెడ్డి జాబితాలో ఇంకెంతమంది రాజకీయనాయకులు ఉన్నారో అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా శ్రీరెడ్డి వ్యాఖ్యలు పెనుదుమారాన్నే రేపుతున్నాయి. ఆమె జాబితాలో ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారా ఇంకా చాలామంది నాయకులు ఉన్నారా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పేరును కూడా క్యాస్టింగ్ కౌచ్ అంశంలో చేర్చారు శ్రీరెడ్డి. ఇక శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై ఇప్పటి దాకా ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+