రవితేజ బయటపెట్టిన నిజాలు?; ఇండస్ట్రీ పార్టీల్లో సీక్రెట్ రూమ్ సర్వీస్ కూడా!..
ఇండస్ట్రీలో రేవ్ పార్టీలు చాలా కామన్ అని చెప్పిన రవితేజ.. వాటిని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారు? వంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదని సిట్ అధికారి తెలిపారు.
హైదరాబాద్: శనివారం నాడు హీరో రవితేజ సిట్ అధికారుల ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డ్రగ్స్ లింకులకు సంబంధించి రవితేజ కొన్ని కీలక విషయాలు వెల్లడించగా.. మరికొన్ని విషయాలను దాటవేసినట్లు సమాచారం.
అలాగే బ్లడ్, హెయిర్, గోళ్ల శాంపిల్స్ ఇవ్వడానికి కూడా రవితేజ నిరాకరించడం గమనార్హం. సిట్ విచారణకు రవితేజ ముందుగానే ప్రిపేర్ అయి వచ్చారని సిట్ అధికారి ఒకరు తెలిపారు. చాలా ప్రశ్నలను ఆయన దాటవేశారని, ఇక మీరు డ్రగ్స్ తీసుకుంటారా? అన్న ప్రశ్నను రవితేజ తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు.

అదే సమయంలో ఇండస్ట్రీలో రేవ్ పార్టీలు చాలా కామన్ అని, అందులో డ్రగ్స్ కూడా కామన్ అని చెప్పిన రవితేజ.. వాటిని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారు? వంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదని సిట్ అధికారి తెలిపారు. ఇక పూరి జగన్నాథ్ గురించి ప్రస్తావించినప్పుడు.. ఆయన తనకు మంచి మిత్రుడు అని రవితేజ సమాధానం చెప్పారు.
ఇక తన తమ్ముడు భరత్ విషయం గురించి మాట్లాడుతూ.. అతనికి గంజాయి అలవాటు ఉంటే ఉండొచ్చు తప్ప కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ తీసుకుని ఉండరని చెప్పారు. భరత్ వల్లే మీకు డ్రగ్స్ అలవాటయ్యాయా? అన్న ప్రశ్నను రవితేజ ఖండించారు.
రవితేజను విచారిస్తున్న క్రమంలోనే సయ్యద్ యూనస్, తౌబిర్ అహ్మద్ అనే మరో ఇద్దరిని కూడా సిట్ విచారించింది. సయ్యద్ పలు కీలక వివరాలు వెల్లడించినట్లు చెబుతున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన చాలా పార్టీల్లో 'సీక్రెట్ రూమ్ సర్వీస్' కూడా ఉంటాయని అతను పేర్కొనడం గమనార్హం. కాగా, సయ్యద్ ఓ పబ్ లో బౌన్సర్‌గా పనిచేస్తుండగా.. తౌబిర్ గంజాయి సప్లయర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications