Tollywood Gossips:ఆ స్టార్ హీరోకు.. ఈ ముద్దుగుమ్మ మధ్య కహానీ క్యాహై..?
హైదరాబాద్: సినిమా పరిశ్రమలో బాలీవుడ్ తర్వాత టాలీవుడ్ అతి పెద్ద ఇండస్ట్రీ. ఇక్కడ గాసిప్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఫిలింనగర్‌లో చక్కర్లు కొట్టే గాసిప్స్ కొన్ని చూద్దాం...

కింగ్ నాగార్జునకు అఖిల్ తలనొప్పిగా మారాడా..?
కింగ్ నాగార్జున... ఈ మన్మధుడికి కొత్త తలనొప్పి వచ్చిపడిందని ఫిల్మ్‌నగర్ కోడై కూస్తోంది. అది ఎవరివల్లనో కాదు.. ఆయన కొడుకు నవమన్మధుడు అఖిల్ నుంచేనటా. ఓ వైపు అఖిల్‌ను మంచి స్టార్‌గా తీర్చి దిద్దేందుకు కింగ్ నాగార్జున కష్టపడుతుంటే మరోవైపు ఈ యంగ్ హీరో తండ్రికి తలనొప్పిగా మారాడంటూ టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారంటారా... ఏమీ లేదండి. ఈ యంగ్ హ్యాండ్సమ్ హీరోకు సంబంధించి ఓ వీడియో లీకైంది. ఇప్పుడు ఈ యవ్వారమే అక్కినేని ఇంట మంటపుట్టిస్తోందట.
లీకైన వీడియోలో అక్కినేని చిన్నోడు అఖిల్ ఓ పబ్‌లో హల్చల్ చేసినట్లు కనిపిస్తోంది. అంతేకాదు ఓ వ్యక్తిపై దురుసుగా కూడా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీకంటూ ఓ ఇమేజ్ ఉంది. దీంతో అఖిల్ ప్రవర్తనపై నాగ్ సీరియస్ అయినట్లు సమాచారం. అయితే నాగ్ ఓ తండ్రిగా తన పిల్లలకు ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఇచ్చారు. కానీ లిమిట్స్ దాటేంత కాదు. అయితే పబ్‌లో జరిగిన ఇన్సిడెంట్ వీడియో లీక్ కావడంతో తండ్రిగా అఖిల్‌ను నాగ్ మందలించినట్లు సమాచారం. అయితే తండ్రి నాగార్జున మందలింపును అఖిల్ సీరియస్‌గా తీసుకుంటాడా లేదా అనేది చూడాలి. ఇక సినిమాల పరంగా అక్కినేని ప్రిన్స్‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం స్పై థ్రిల్లర్ ఏజెంట్ చిత్రంలో నటిస్తున్నాడు ఈ అక్కినేని అందగాడు. ఏజెంట్ చిత్రం అక్టోబర్ 5వ తేదీ విడుదల కానున్నట్లు సమాచారం.
స్టార్ హీరో కొడుకును రిజెక్ట్ చేసిన జక్కన్న..?
రాజమౌళి... సినిమాలను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ పరిచయం అక్కర్లేని పేరు. ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లిన దర్శకధీరుడు. రాజమౌళి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ అయినా చేయాలంటూ చాలామంది నటులు ఆశగా ఎదురుచూస్తుంటారు. ఒక్కసారి రాజమౌళి సినిమాలో కనిపిస్తే తమ ఫేట్ మారిపోతుందనుకునే వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక రాజమౌళి గురించి కూడా ఓ వార్త ఫిలింనగర్‌లో షికారు చేస్తోందండోయ్.
ఇక టాలీవుడ్‌లోని ఓ టాప్ హీరో తన కొడుకును ఓ గొప్ప డైరెక్టర్ చేతులుమీదుగా లాంచ్ చేయాలని భావించారట. ఇందుకోసం మెగా డైరెక్టర్ రాజమౌళిని అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి మాత్రం ఆ రిస్క్ చేయలేనంటూ ఆ టాప్ హీరో ముఖం మీదే చెప్పేశాడంటూ ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తాను మరో ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నట్లు రాజమౌళి చెప్పారట. అంతేకాదు ఆ టాప్ స్టార్ కొడుకు ఫిజిక్ పై కూడా కామెంట్ చేసినట్లు సమాచారం. అలాంటి ఫిజిక్ ఉన్నవాడిని డైరెక్ట్ చేయడం కష్టమని తెగేసి చెప్పేశారట ఈ RRR డైరెక్టర్. ఇంకేముంది ఆ టాప్ హీరో ముఖం చిన్నబోయిందట.
అయితే ఈ వార్త బయటకు పొక్కగానే కొందరు రాజమౌళికి గర్వం తలకెక్కిందని చెవులు కొరుక్కుంటుంటే... మరికొందరు మాత్రం జక్కన్న ముక్కుసూటి తనాన్ని ధైర్యాన్ని కొనియాడుతున్నారట. ఇదంతా అటుంచితే... ఆ స్టార్ హీరో ఎవరు, జక్కన్న రిజెక్ట్ చేసిన ఆ వ్యక్తి ఎవరో అనేదానిపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి.

బన్నీ-కేతిక శర్మల మధ్య యవ్వారం ఏంటి..?
అల్లు అర్జున్... పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా చాలా క్లోజ్‌గా ఈ స్టయిలిష్ స్టార్‌ను ఫాలో అవుతోంది. ఈ మధ్యే అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్న బన్నీ తన ఫ్రెండ్స్‌తో ఓ పబ్‌లో పార్టీ చేసుకుంటూ కెమెరా కంటికి చిక్కాడు. ప్రస్తుతం పుష్పా ది రూల్ చిత్రం షూట్ కోసం సిద్ధమవుతున్నాడు.
ఇక అల్లు అర్జున్ తనపై వచ్చే రూమర్లను పెద్దగా పట్టించుకోరు. అంతేకాదు ఇలాంటి పుకార్లకు కూడా దూరంగా ఉంటాడు. తన మొత్తం కెరీర్‌లో ఇప్పటి వరకు ఏ హీరోయిన్‌తో కూడా అఫెయిర్స్ ఉన్నట్లు వార్తలు రాలేదు. తన కుటుంబంతో హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నాడు. అయితే తాజాగా బన్నీకి కూడా కొన్ని కష్టాలు వస్తున్నాయి. కొందరు హీరోయిన్స్‌తో బన్నీని లింక్ చేస్తున్నారు. ఈ జాబితాలో కేతిక శర్మ ఇంకా ప్రియాంకా జవాల్కర్‌లు ఉన్నారు.
టాక్సీవాలాతో ఎంట్రీ ఇచ్చి ఓ ఊపుఊపేసిన ప్రియాంకా జవాల్కర్ అల్లు అర్జున్‌పై క్రష్ ఉందంటూ ఓపెన్‌గానే చెప్పేసింది. ఆ సమయంలో అల్లు వారబ్బాయి.. ప్రియాంకాల మధ్య ఏదో ఇంకేదో నడిచిందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా బన్నీ కేతికా శర్మల మధ్య ఏదో యవ్వారం నడుస్తోందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. కేతికా శర్మ చేసిన సినిమాలు చాలా తక్కువే అయినప్పటికీ తన హాట్ లుక్స్, కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యువతను జస్ట్ అలా పడగొట్లటేస్తోంది. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించింది కేతికా. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏడాదికాలమే అయినప్పటికీ... బన్నీ కేతికా శర్మల మధ్య సీక్రెట్‌గా డేటింగ్ నడిచిందంటూ ఫిలింనగర్లో పుకార్లు షికారు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications