Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దత్తత గ్రామం ఇదే: ఈనెల 29న చింతలకుంటకు మహేష్ బాబు..!

హైదరాబాద్: 'శ్రీమంతుడు' చిత్రం విజయంతో జోరు మీదున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల తెలంగాణలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హీరో మహేష్ బాబు తెలంగాణ రాష్ట్రంలో వెనకుబడ్డ పాలమూరులో పర్యటించనున్నట్లు తెలిసింది.

మహబూబ్ నగర్ జిల్లాలోని చింతలకుంట గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటున్నట్టు మహేష్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ నెల 29న ఆ గ్రామంలో మహేష్ బాబు పర్యటిస్తారని సమాచారం. గ్రామంలో పరిస్థితులు, అక్కడ అవసరమైన సౌకర్యాలు, ఇతర విషయాలపై గురించి మహేష్ బాబు తెలుసుకునే అవకాశం ఉంది.

ట్వట్టర్ వేదికగా రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలోని ఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకొమ్మని ట్విట్టర్ వేదికగా మహేష్‌బాబును కోరగా.. పాలమూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు మహేష్ బాబు సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తానని తెలిపాడు.

Tollywood hero mahesh babu will visit palamuru district on 29th august

ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన ఈ ఆసక్తికర అంశాన్ని పోస్ట్ చేశారు. పాలమూరు జిల్లాలో ప్రిన్స్ మహేష్ బాబు ఏ గ్రామాన్ని దత్తత తీసుకుంటారని అభిమానుల్లో పెద్ద చర్చ కూడా సాగింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు పాలమూరు జిల్లాలోని గట్టు మండలం చింతలకుంట గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు.

ఇందులో భాగంగా మహేష్ బాబు ఈనెల 29న ఆయన ఆ గ్రామంలో పర్యటించనున్నట్లు సమాచారం. 'గ్రామజ్యోతి'లో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కోరిన మీదటే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని మహేష్ బాబు ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన స్మార్ట్ విలేజ్ కార్యక్రమం కింద తన సొంత గ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+