పవన్ పైనే 'మెగా' భారం- కీలక భేటీ, ఛలో అమరావతి..!!

టాలీవుడ్ లో సంక్రాంతి టెన్షన్ మొదలైంది. సీఎం రేవంత్ తన వైఖరి తేల్చి చెప్పారు. బెనిఫిట్ షోలు.. టికెట ధరలకు అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో చేసిన ప్రకటనకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసారు. దీంతో, ఇప్పుడు టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల పైన ఉత్కంఠ పెరుగుతోంది. రేవంత్ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం పైనా ఒత్తిడి మొదలైంది. ఇప్పుడు టాలీవుడ్ .. మెగా ఆశలు అన్నీ పవన్ పైనే. డిప్యూటీ సీఎం గా పవన్ ఏం చేయబోతున్నారు.. పరిశ్రమకు ఈ కష్ట కాలంలో ఎలా అండగా నిలుస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

రేవంత్ తేల్చేయటంతో
ఈ సారి సంక్రాంతి పెద్ద హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి. కొన్నేళ్లుగా ప్రముఖ హీరోల సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బెనిఫిట్ షో లు.. టికెట్ ధరల పెంపు సాధారణ ప్రక్రియ గా మారింది. కానీ, తాజాగా పుష్ఫ -2 ప్రీమియర్ షో తొక్కిసలాట, మహిళ ప్రాణాలు కోల్పోవటం, తాజా పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రంలో బెనిఫిట్ షో లు.. టికెట్ ధరల పెంపు కు నో చెప్పింది. ఈ రోజు సినీ ప్రముఖుల సమావేశంలోనూ ఈ నిర్ణయంలో మార్పు లేదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. తెలుగు సినిమాలకు తెలంగాణ పెద్ద మార్కెట్ గా ఉంది. అదే విధంగా ఏపీ ప్రభుత్వం పైన రేవంత్ నిర్ణయం తో పరోక్షంగా ఒత్తిడి పెరుగుతోంది.

Tollywood now look at AP govt over benefit shows after CM Revanth clarity over ticket hike

సంక్రాంతి సినిమాలు
దీంతో, సంక్రాంతి సినిమాల పైన టెన్షన్ పెరుగుతోంది. ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ డాకూ మహారాజ్, వెంకటేశ్​ సంక్రాంతికి వస్తున్నాం, సందీప్ కిషన్ మజాకా సినిమాలు రేసులో ఉన్నాయి. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు దిల్ రాజు నిర్మాత. కాగా, 'డాకూ మహారాజ్' మూవీకి నైజాంలో డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. ప్రస్తుతం రేవంత్ తో తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ గా ఉన్న దిల్ రాజ్ జోక్యంతో తాజా సమావేశం జరిగింది. కానీ, అసలు ఫలితం దక్కలేదు. దీంతో.. ఇప్పుడు ఏపీ పైనే ఆశలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ టాలీవుడ్ కు గేమ్ ఛేంజర్ గా కనిపిస్తున్నారు.

పవన్ పైనే ఆశలు
పవన్ కల్యాణ్ తో సినిమా పెద్దల సమావేశానికి రంగం సిద్దమవుతోంది. ఇందు కోసం ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ తో సమావేశానికి సినీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 30న అమరావతిలో సమావేశం జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే, రేవంత్ నిర్ణయం తరహా లోనే చంద్రబాబు వ్యవహరించాలని ఇప్పటికే పలు డిమాండ్లు తెర మీదకు వచ్చాయి. దీంతో, సినీ పెద్దలు అప్రమత్తం అయ్యారు. ఏపీ ప్రభుత్వంతో భేటీకి బాలయ్య ను తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో, ఇప్పుడు పవన్ ఏ విధంగా టాలీవుడ్ కు అండగా నిలుస్తారు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+