తెలంగాణకు కాబోయే సీఎం ఎవరో స్పష్టం చేసిన బండ్ల గణేష్
Bandla Ganesh: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 62 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు సమాచారం. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడుతున్నాయి. తెలంగాణతో పాటు అయిదు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో వివిధ సంస్థలు నిర్వహించి ఎగ్జిట్ పోల్స్ వివరాలు అందుతున్నాయి.
తెలంగాణపై ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ (India TV-CNX) నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ (Telangana Exit Polls)లో భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ- అధికార భారత్ రాష్ట్ర సమితికి నిరాశ తప్పదని తేల్చిందీ సర్వే. కాంగ్రెస్ వైపునకు మొగ్గు చూపింది. హస్తం పార్టీకి భారీ సంఖ్యలో సీట్లను గెలుస్తుందని అంచనా వేసింది.

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం.. 60. బీఆర్ఎస్ ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకోలేదని అంచనా వేసింది. 31 నుంచి 47 స్థానాలకే పరిమితమౌతుందని అభిప్రాయపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం అసాధ్యమని వివరించింది.
మూడోసారి అధికారంలోకి రావాలనే బీఆర్ఎస్ ఆశలు ఏవీ ఫలించబోవని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ (India TV- CNX exit polls on Telangana) ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. తెలంగాణలో మరోసారి గులాబీ జెండా ఎగురకపోవచ్చని, కారు జోరు తగ్గుతుందని వివరించింది.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి మోజారిటీని సాధిస్తుందని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ తెలిపింది. ఏకంగా 63 నుంచి 79 స్థానాలతో హస్తం పార్టీ జెండా ఎగురవేస్తుందని తేల్చింది. బీజేపీకి రెండు నాలుగు సీట్లకే పరిమితమౌతుంది. అఖిల భారత్ మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌కు అయిదు నుంచి ఏడు సీట్లు దక్కుతాయి.
దీనికి అనుగుణంగా తన అంచనాలను వెల్లడించారు ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండ్ల గణేష్ (Bandla Ganesh). కాంగ్రెస్ పార్టీకి 75 కంటే ఎక్కువ స్థానాలు లభిస్తాయని తేల్చి చెప్పారు. తెలంగాణలో ఘన విజయం సాధించేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు.
అక్కడితో ఆగలేదాయన. ఇంకో అడుగు ముందుకేశారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరో కూడా తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి అని జోస్యం చెప్పారు. రాష్ట్ర నూతన అంటూ దానికి రేవంత్ రెడ్డి ఎక్స్ అకౌంట్ లింక్‌ను యాడ్ చేశారు. దాని పక్కన టైగర్ ఎమోజీలను పోస్ట్ చేశారు. స్మార్ట్ సంస్థ రూపొందించిన ఎగ్జిట్ పోల్స్ రికార్డులను దీనికి సాక్ష్యంగా చూపించారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications