హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగు చిత్రసీమలో మరో విషాదం: కరోనాతో గాయకుడు జీ ఆనంద్ కన్నుమూత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ సినీ గాయకుడు జీ ఆనంద్()67 కరోనా బారినపడి గురువారం రాత్రి కన్నుమూశారు. కరోనా చికిత్సలో బాగంగా సకాలంలో వెంటిలేటర్ లబించకపోవడంతో ఆనంద్ మృతి చెందినట్లు సమాచారం.

ఆనంద్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా తులగమ్ గ్రామం. ఐదు దశాబ్ధాలుగా సినీ సంగీత రంగంలో ఆయన కొనసాగుతున్నారు. స్వరమాధురి సంస్థ స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా 6500కుపైగా కచేరీలో నిర్వహించారు. ప్రస్తుతం సినీగాయనీ గాయకులుగా ఉన్న పలువురు ఈ సంస్థ ప్రోత్సహం వల్ల వచ్చిన వారే కావడం గమనార్హం.

 tollywood senior singer g anand dies with coronavirus

Recommended Video

Actor Vivek Biography : తన ధ్యేయం ఇదే , ఆ రూమర్స్ నమ్మొద్దు | Kollywood | Oneindia Telugu

ఒక వేణువు వినిపించెను(అమెరికా అమ్మాయి) , దిక్కులు చూడకు రామయ్య.., విఠలా విఠలా పాండురంగ విఠలా.. వంటి సూపర్ హిట్ పాటలను ఆనంద్ ఆలపించారు. కృష్ణ నటించిన పండంటి కాపురం, గాంధీన్ రెండో వీధి, స్వాతంత్ర్యానికి ఊపిరిపోయండి, రంగవల్లి చిత్రాలకు సంగీత దర్శకుడిగా కూడా ఆనంద్ వ్యవహరించారు. పలు అనువాద చిత్రాలకు, సీరియల్స్‌కు ఆయన సంగీతం అందించారు. గత సంవత్సరం ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కూడా కరోనాతో మరణించిన విషయం విధితమే.

English summary
tollywood senior singer g anand dies with coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X