Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tomato: దిగొచ్చిన టమాటా ధరలు.. ఇక డొంట్ వర్రీ..

రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న టమాటా ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. భారీగా పెరిగిన ధరలతో కొంత మంది టమాటాలు వాడడమే మానేశారు. కానీ గత మూడు రోజులు టమాటా ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. దిగుబడి పెరగడంతోనే టమాటా ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు టమాటా రాక పెరగడంతో ధరలు తగ్గాయి. హైదరాబాద్ లోని పలు రైతు బజారుల్లో కిలో టమాటా రూ.63 నుంచి రూ.70 పలుకుతోంది. ఇక రిటైల్ లో కిలో రూ.120 నుంచి రూ.140 పలుకుతోంది. దీంతో సామాన్యులు కాస్త ఉపశమనం పొందుతున్నారు.

ధరలు తగ్గడంతో టమాటా రైతులు ఉసురుమంటున్నారు. భాగ్యనగరానికి 10 రోజుల కిందటి వరకు రోజుకు 600 నుంచి 900 క్వింటాళ్ల వరకు టమాటా వచ్చేది.. కానీ సోమవారం 2450 క్వింటాళ్ల టమాటా వచ్చింది. దీంతో టమాటా ధర తగ్గింది. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కర్ణాటక నుంచి భారీగా టమాటా రావడంతో ధర తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటు తెలంగాణలోనూ టమాటా దిగుబడి పెరిగింది. హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాలైన రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల నుంచి కూడా టమాటా అధికంగా వచ్చింది.

Tomato prices in Hyderabad are falling heavily

ఫలితంగా ధరలు తగ్గాయి. టమాటా రాక పెరిగితే కిలో టమాటా రూ.40 లకు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కిలో టమాటా రూ.40 నుంచి రూ.50 మధ్యలో ఉంటే వినియోగదారులు, రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండని చెబుతున్నారు. మరోవైపు టమాటా ధరలు పెరగడంతో చాలా మంది మంది తమ పొలంలో కొంత మొత్తంలో టమాటా సాగు చేస్తున్నారు. దీంతో వారి ఇంటి అవసరాలను తీర్చుకుంటూ మిగిలితే బయట అమ్ముతున్నారు. దీని వల్ల కూడా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

అయితే హోల్ సేల్ మార్కెట్ టమాటా నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తారు. మేలు రకానికి ఎక్కువగా.. రెండో రకానికి కాస్త తక్కువగా అధికారులు ధర నిర్ణయిస్తారు. అయితే వ్యాపారులు మాత్రం అన్ని రకాల టమాటాకు ఒకే ధరలను వసూలు చేస్తున్నారు. రైతు బజారులో కిలో రూ.63 అని బోర్డు పెట్టిన కేజీ రూ.100 లకు విక్రయిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+