భారీ ఎన్ కౌంటర్ - మావోయిస్టు అగ్రనేత హతం..!!
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత సహా పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. నేషనల్ పార్క్‌లో కాల్పు లు కొనసాగుతోన్నాయి. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు ఉన్నట్లు భద్ర తా బలగాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు.. ఆ ప్రాంతా నికి చేరుకొని కూంబింగ్ చేపట్టాయి. బలగాల సెర్చ్ ఆపరేషన్‌లో సుధాకర్ చిక్కినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టు కీలక నేత హిడ్మా లక్ష్యంగా కేంద్ర బలగాలు బీజాపూర్ అడవులను జల్లెడ పడుతు న్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సింహాచలం అలియాస్ సుధాకర్(65) మృతి చెందారు. బీజాపూర్ జాతీయపార్కు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 2004లో వైఎస్ ప్రభుత్వంతో జరిగిన శాంతిచర్చల్లో సుధాకర్ పాల్గొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. సుధాకర్ తలపై రూ. కోటి రివార్డు ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి మండలం ప్రగడవరం ఆయన స్వగ్రామం. ఇక ఈ సంఘటన స్థలంలో కొన్ని ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బలగాల సెర్చ్ ఆపరేషన్‌లో సుధాకర్ చిక్కినట్లు తెలుస్తోంది.

ఘటనాస్థలంలో ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో సింహాచలం ఉన్నారు. సుధాకర్ మారుపేర్లు సింహాచలం, గౌతమ్.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications