టాప్ సెక్స్ నగరాలు: హైద్రాబాద్ కు చోటు, ఫోర్న్ సైట్లు చూడడంలో హైద్రాబాదీలే టాప్

ప్రపంచంలో శృంగారాన్ని మనసారా ఆస్వాదించే టాప్ 100 నగరాల్లో హైద్రాబాద్ స్థానం దక్కించుకొంది. ప్రేమకు, రొమాన్స్ కు రాజధానిగా పేరొందిన పారిస్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

హైదరాబాద్: ప్రపంచంలో శృంగారాన్ని మనసారా ఆస్వాదించే టాప్ 100 నగరాల్లో హైద్రాబాద్ స్థానం దక్కించుకొంది. ప్రేమకు, రొమాన్స్ కు రాజధానిగా పేరొందిన పారిస్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. తాజాగా శృంగారం విషయంలో కూడ హైద్రాబాదీలు వందలోపు స్థానంలో నిలిచారు. విదేశాలతో హైద్రాబాద్ కూ పోటీపడుతోంది.

ప్రపంచంలో శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించే పట్టణాలు, నగరాలపై ద మోస్ట్ సెక్స్ పాజిటివ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ పేరుతో అడల్ట్ యాప్ లజీవా సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ప్రపంచవ్యాప్తంగా 200 పట్టణాల్లో ఈ అధ్యయనం నిర్వహించి టాప్ 100 పట్టణాలను ప్రకటించారు.అయితే ఇందులో భారత్ కు చెందిన ఐదు నగరాలున్నాయి.

ఫోర్న్ వీడియోలు చూడడంలో హైద్రాబాదీలు టాప్

ఫోర్న్ వీడియోలు చూడడంలో హైద్రాబాదీలు టాప్

శృంగారంలో ఆసక్తిగా పాల్గొనకపోయినా...పాల్గొన్నప్పుడు సంతృప్తి పొందడంలో మాత్రం హైద్రాబాదీలు పదికి 3.5 స్కోర్ తో మిగతా నగరాల కంటే ముందున్నారు. ఈ విషయంలో చెన్నై 1.1 స్కోర్ తో అట్టడుగు స్థానంలో ఉన్నారు.


ఫోర్న్ సైట్ల కోసం నెట్ లో వెతికేటప్పుడు 5 నగరాలవాసులు విభిన్నమైన పదాలను ఉపయోగిస్తారని ఈ సర్వేలో తేలింది. ఢిల్లీవాసులు వైఫ్ , హైద్రాబాదీలు కాలేజ్ గర్ల్స్, కోల్ కత్తా వాసులు బెంగాలీ, చెన్నై వాసులు తమిళ్ అనే పదాలతో సెర్చ్ చేస్తారని ఈ సర్వే తేల్చింది.శృంగారంలో పాల్గొనే విషయంలో అట్టడుగున ఉన్న హైద్రాబాద్ ఫోర్న్ సైట్లను చూడడంలో మాత్రం టాప్ లో ఉంది. పదికి 8.7 శాతం స్కోర్ సాధించింది. చెన్నై 8.5, ముంబై 8.2, ఢిల్లీ 7.7, కోల్ కత్తా 7.4 శాతం మాత్రమే.

భారత్ లోని ఐదు నగరాలివే

భారత్ లోని ఐదు నగరాలివే

ప్రపంచంలో శృంగారాన్ని ఆస్వాదించే నగరాల జాబితాలో ఇండియాకు చెందిన ఐదు నగరాలకు చోటు దక్కింది. ముంబై నగరం 71 వ, ర్యాంకును సాధించింది. ఆ తర్వాతి స్థానం ఢిల్లీకి దక్కింది. 78 వ, ర్యాంకు ఢిల్లీకి దక్కింది. హైద్రాబాద్ కు మూడో స్థానం దక్కింది. హైద్రాబాద్ కు 89వ, స్థానం దక్కింది. కోల్ కత్తా, చెన్నై నగరాలు హైద్రాబాద్ కంటే వెనుకబడ్డాయి.90,91 ర్యాంకులతో కోల్ కత్తా, చెన్నై నగరాలు నిలిచాయి.

18 -70 ఏళ్ళ వయస్సువారితో సర్వే

18 -70 ఏళ్ళ వయస్సువారితో సర్వే

ప్రపంచవ్యాప్తంగా 200 పట్టణాల్లోని 18 -70 ఏళ్ళ వయస్సువారితో ఈ సర్వే చేశారు. నాలుగున్నరలక్షల మందితో లవీజా ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. శృంగారంలో పాల్గొనడం, శృంగారంలో ప్రయోగాలు, సంతృప్తి, సెక్స్ టాయ్స్ వినియోగం, శృంగార వీడియోలు, శృంగార సాహిత్య వినియోగం, శృంగార వినోదం, భాగస్వామిని పంచుకోవడం, గర్భనిరోధకాల వినియోగం, స్వలింగ సంపర్కం , శృంగారంలో స్త్రీ, పురుష సమానత్వం వంటి పది అంశాలపై ఈ సంస్థ సమాచారాన్ని సేకరించింది.ఈ పది అంశాల్లో స్కోర్ ఆదారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలకు ర్యాంకింగ్ ఇచ్చింది.

ప్రపంచంలో టాప్ టెన్ ర్యాంకులు సాధించిన నగరాలివే

ప్రపంచంలో టాప్ టెన్ ర్యాంకులు సాధించిన నగరాలివే

ప్రపంచవ్యాప్తంగా టాప్ వన్ లో పారిస్ నిలిచింది. పారిస్ తర్వాత రియో డి జెనిరో, లండన్, లాస్ ఎంజెలిస్, బెర్లిన్, న్యూయార్క్, సావో, పాలో , లాస్ వెగాస్, లెబిజా, ఆమ్ స్టర్ డామ్ లు నిలిచాయి.అమెరికాలోని పది నగరాలకు ఈ జాబితాలో స్థానం దక్కలేదు.ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భాగస్వామిని పంచుకొనే క్లబ్ లు, శృంగార వినోద కేంద్రాలు ఉండడంతో ప్యారిస్ అత్యంత శృంగార నగరంగా ఫస్ట్ ర్యాంక్ ను సాధించింది.

ఫోర్న్ వినియోగంలో టాప్ వీరే

ఫోర్న్ వినియోగంలో టాప్ వీరే

శృంగార కార్యకలాపాలు , శృంగారంలో ప్రయోగాల విషయంలో రియోకు పదికి పది శాతం మార్కులు దక్కాయి. ఇతర అంశాల్లో పారిస్ కంటే మెరుగైన స్కోర్ నే సాధించింది. ఫోర్న్ వినియోగం, శృంగార వినోదంలో లాస్ వెగాస్ కు టాప్ ర్యాంకు దక్కింది.

ఉత్తర అమెరికాకు చెందిన మరో నాలుగు నగరాలు ఫోర్న్ వినియోగంలో అగ్రస్థానంలో నిలిచాయి. భాగస్వామిని పంచుకోవడంలో బెర్లిన్ అగ్రస్థానంలో నిలిచింది. స్వలింగసంపర్కానికి అనుకూలంగా లండన్ టాప్ లో నిలిచింది. బెల్జియం దేశంలోని దేశంలోని ఎంట్ వెర్స్, బ్రస్సెల్స్ శృంగారంలో పూర్తి సంతృప్తి పొందుతున్న నగరాలుగా టాప్ ర్యాంకులందుకొన్నాయి. ఆరోగ్యకరమైన, సురక్షితమైన శృంగారాన్ని ప్రోత్సహించడం ద్వారా సెక్స్ పట్ల ఉన్న అపోహల్ని తొలగించేందుకు ఈ సర్వే చేపట్టినట్టు లజీవా సంస్థ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+