కుదిపేస్తున్న డ్రగ్స్: ముమైత్ ఖాన్ స్పందన
తనపై డ్రగ్స్ తీసుకున్న ఆరోపణలు రావడంపై ప్రముఖ ఐటమ్ డ్యాన్సర్ ముమైత్ ఖాన్ స్పందించారు. తనపై గతంలోను ఇలాంటి గాసిప్స్ వచ్చాయని, ఇది కొత్త కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తనపై డ్రగ్స్ తీసుకున్న ఆరోపణలు రావడంపై ప్రముఖ ఐటమ్ డ్యాన్సర్ ముమైత్ ఖాన్ స్పందించారు. తనపై గతంలోను ఇలాంటి గాసిప్స్ వచ్చాయని, ఇది కొత్త కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు వచ్చినట్లే ఇప్పుడు వచ్చాయన్నారు.
కాగా, డ్రగ్స్ లింక్‌లో తమకు నోటీసులు వచ్చాయన్న వార్తలపై పలువురు సినీ తారలు స్పందించిన విషయం తెలిసిందే.
టాలీవుడ్‌ను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. కొందరు సినీ ప్రముఖులకు డ్రగ్ మాఫియాతో సంబంధం ఉందంటూ ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి కొందరి పేర్లు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

డ్రగ్స్ వ్యాపారంలో ఆరితేరిన కెల్విన్ కాల్ లిస్ట్ ఆధారంగా ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేతృత్వంలో అధికారులు మొత్తం కూపీ లాగారు. దాని ఆధారంగానే తెలుగు సినీ రంగానికి చెందిన పలువురికి నోటీసులు జారీచేశారు.
తమ పేర్లు బయటకు రావడం, నోటీసులు అందడం పట్ల సినీ తారలు ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు. తనకు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం లేదని నవదీప్ చెప్పారు. తనకు ఏ అలవాటు లేదని సుబ్బరాజు చెప్పారు.












Click it and Unblock the Notifications