భారీ వర్షం పడినప్పుడల్లా ఇదే బాధ! మంచులా ముంచెత్తుతున్న టాక్సిక్ ఫోమ్!
కూకట్‌పల్లిలోని ధరణి నగర్ వాసులకు కొత్త చిక్కొచ్చి పడింది. ధరణి నగర్‌లోని ఇళ్లను టాక్సిక్ ఫోమ్ (విషపు నురగ) ముంచెత్తుతోంది. పరికి చెరువునుంచి వస్తున్న ఈ ఫోమ్ డ్రెయిన్‌ల ద్వారా ఇళ్లలోకి చేరుతోంది.
హైదరాబాద్: శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షం కారణంగా హైదరాబాద్ లో చాలా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల్లో జవాసాల్లోకి భారీగా నీరు చేరడంతో నగరవాసుల జీవనం అతలాకుతలమైంది.
మరోవైపు కూకట్‌పల్లిలోని ధరణి నగర్ వాసులకు కొత్త చిక్కొచ్చి పడింది. ధరణి నగర్‌లోని ఇళ్లను టాక్సిక్ ఫోమ్ (విషపు నురగ) ముంచెత్తుతోంది. పరికి చెరువు నుంచి వస్తున్న ఈ టాక్సిక్ ఫోమ్ డ్రెయిన్‌ల ద్వారా ఇళ్లలోకి చేరుతోంది. ఈ నురగతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెల్లగా, మంచు గుట్టలా పేరుకుపోయిన నురుగును తొలగించుకోవడానికి స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ చెరువు నుంచి గతంలోనూ టాక్సిక్ ఫోమ్ విడుదలైనా ఈ స్థాయిలో రావడం ఇదే ప్రథమం.
శనివారం మళ్లీ హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి టాక్సిక్ ఫోమ్ మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కాలనీ వాసులు భయపడుతున్నారు. జీహెచ్ఎంసీ తక్షణమే చర్యలు చేపట్టి ఈ రసాయన నురగ నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications