కేసీఆర్ పై అక్కడే రేవంత్ తొలి సక్సెస్ - ఢీ అంటే ఢీ అంటూ..!!

రేవంత్ రెడ్డి. ఇప్పడు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. రాజకీయ చాణుక్యుడిగా పేరున్న కేసీఆర్ ను మట్టికరిపించిన హీరోగా రేవంత్ నిలిచారు. మూడు రాష్ట్రాల్లో ఓడిన కాంగ్రెస్ కు తెలంగాణలో విజయం అదించి హైకమాండ్ కు ఓదార్పు ఇచ్చారు. ఈ విజయం వెనుక చాలా కష్టం ఉంది. కేసీఆర్ పైన ప్రజల్లో ఉన్న వ్యతిరేక అభిప్రాయాలు ఏంటో గుర్తించారు. అక్కడ నుంచి వ్యూహాత్మకంగా వేసిన ఒక్కో అడుగు నేడు పార్టీని అధికారంలోకి తెచ్చింది. పార్టీ విజయంలో రేవంత్ వ్యూహాలతో కేసీఆర్ ఓటమి పాలవ్వక తప్పలేదు.

రేవంత్ మేనియా : తెలంగాణ కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు స్వీకరించిన రోజునే రేవంత్ తన లక్ష్యం ఏంటో డిసైడ్ చేసుకున్నారు. కేసీఆర్ ను ఓడించాలని శపధం కట్టారు. పార్టీలో అవమానాలు..అడ్డంకులు వచ్చినా సహనంతో అధిగమించారు. పార్టీ సీనియర్లు చేసిన రసాభాసను పట్టించుకోలేదు. ఢిల్లీ నాయకత్వం వద్ద విధేయతను చాటుకున్నారు. తన వాగ్దాటితో కేసీఆర్ ను ఢీ కొట్టగలనని పార్టీ నాయకత్వాన్ని మెప్పించారు.

TPCC Chief Revanth moved Strategically to defeat KCR, finally Reached the Goal

తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం కేసీఆర్ దెబ్బ తీస్తున్నాడని ప్రచారం చేసారు. ప్రజలతో కేసీఆర్ దొర తరహాలో వ్యవహరిస్తున్నారని బలంగా ప్రచారం చేసారు. ఆ ప్రచారం ప్రజలను తాకింది. తెలంగాణ పల్లెల్లో ఆత్మభిమానాలు ఎక్కువ. ఆదరిస్తే గుండెల్లో పెట్టుకొని చూస్తారు. అవమానిస్తే పొలిమేర్లకు తరిమేస్తారు. ఈ సూత్రంతో ముందుకు వెళ్లిన రేవంత్ అక్కడే కేసీఆర్ పై తొలి విజయం సాధించారు.

రేవంత్ వ్యూహాలు సక్సెస్ : ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ లేదు. అదే సమయంలో ఓటర్ల మూడ్ ఏంటో రేవంత్ గుర్తించారు. కేసీఆర్ వ్యూహాలు ఏంటో అర్దం చేసుకున్నారు. బీజేపీ తమ గెలుపుకు అడ్డు కాకూడదని నిర్ణయించారు. అంతే, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని ప్రతీ ఇంటికి చేరేలా నినదించారు. అదే ప్రచారం చేసారు. ఆ ప్రయోగం ఫలితం ఇచ్చింది. ఫలితంగా మైనార్టీలు సైతం ఎంఐఎం, కేసీఆర్ ను కాదని కాంగ్రెస్ వైపు మళ్లారు.

బీజేపీ బీసీ సీఎం నినాదం తో వచ్చినా..ఎస్సీ వర్గీకరణతో కదిలినాన వ్యూహాత్మక మౌనం పాటించారు. తెలంగాణలోబలమైన సామాజికవర్గానికి చెందిన నేతలను పార్టీలో చేర్చుకొనేందుకు వారి ఇళ్లకు వెళ్లారు. దీని ద్వారా ఆ సామాజిక వర్గం మద్దతు పూర్తిగా సాధించారు. అదే ఇప్పుడు మూడు జిల్లాల్లో పార్టీకి క్లీన్ స్వీప్ చేయటానికి తోడ్పాటు అందించింది.

TPCC Chief Revanth moved Strategically to defeat KCR, finally Reached the Goal

హైకమాండ్ కు విధేయుడిగా : సీనియర్లతో సమస్యలు లేకుండా హైకమాండ్ ముఖ్యులతోనే తన అభిప్రాయాలను పంచుకొని అవి అమలయ్యేలా చేసారు. ఇక..కాంగ్రెస్ దే గెలుపు అనే పాజిటివ్ టాక్..మౌత్ పబ్లిసిటీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో, కాంగ్రెస్ గెలుస్తుందని ప్రతీ వాడలోనూ వినిపించేలా చేసారు. మార్పు తీసుకొద్దాం..దొరల పాలన వద్దు అంటూ సాధారణ ప్రజల్లోకి నినాదాలు తీసుకెళ్లారు.

కేసీఆర్ ను తాను మాత్రమే ఢీ కొట్టగలననే నమ్మకం ప్రజల్లో కలిగించారు. హైకమాండ్ కు రేవంత్ కంటే సమర్ధుడు పార్టీలో కనిపించలేదు. తెలంగాణలో పరిస్థితి అనుకూలంగా ఉందనే నమ్మకంతో..హైకమాండ్ స్వేచ్ఛ ఇస్తూనే పూర్తిగా పర్యవేక్షణ చేసింది. అంతిమంగా కేసీఆర్ ను కామారెడ్డిలోనే కాదు..తెలంగాణలోనూ ఓడించటంలో రేవంత్ ఛాంపియన్ గా నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+