హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘హ్యాపీ టైమ్స్‌’:తెలంగాణలో కొత్త మార్పుకు శ్రీకారం.. కోమటి రెడ్డితో రేవంత్ రెడ్డి కీలక భేటీ !

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎవరిదారి వారిదే అన్నట్టు వ్యవహరించే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. మంగళవాళం స్వయంగా రేవంత్ రెడ్డి ఆయన ఇంటి వెళ్లి కలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇద్దరు నేతల మధ్య కీలక భేటీ జరిగింది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి తన ట్విట్టర్‌లో తెలిపారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. దానికి "హ్యాపీ టైమ్స్" అని కామెంట్ జత చేశారు.

ఒకే ఫ్రేమ్‌లో ఇద్ద‌రు

తొలి నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియామకంపై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గుర్రుగానే ఉన్నారు. ఎవరిదారి వారిదే అన్నట్లు ఉండే వీరిద్దరు.. కలిసి ఒకే వేదిక కనిపించడం చాలా అరుదు. కొన్ని నెలల క్రితం రైతుల సమస్యలపై ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన రెండు రోజుల దీక్షలో రేవంత్, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కనిపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఆ తర్వాత వారు ఒకే వేదికను పంచుకున్నది లేదు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఒకే ఫ్రేమ్‌లో పక్కపక్కనే నిలబడి ప్రెస్ మీట్‌లో కనిపించారు. సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

2 రేవంత్ , కోమ‌టిరెడ్డిల భేటీలో కీల‌క అంశాలపై చ‌ర్చ‌

2 రేవంత్ , కోమ‌టిరెడ్డిల భేటీలో కీల‌క అంశాలపై చ‌ర్చ‌


అయితే ఇటీవల యదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్ తో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సన్నిహతంగా మెలిగారు. కేసీఆర్ పాలనను పొగడ్తల‌తో ముంచెత్తారు. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. కోమటి రెడ్డి టీఆర్ఎస్‌లో చేరతారంటూ పెద్ద ఎత్తున పుకార్లు కూడా వినిపించాయి. ఈ పరిణామాలతో కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీ ఇన్‌ఛార్జీకి ఫిర్యాదులు కూడా చేశారు.

తెలంగాణ రాజకీయాల్లో మార్పు తీసుకోస్తాం..

ఈ నేపథ్యంలో కోమటి రెడ్డి వెంకట రెడ్డితో టీపీసిసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ప‌లు కీలక అంశాలపై ఇద్ద‌రు చ‌ర్చించుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కలిసి పోరాడాలని నిర్ణయించారు. రానున్న రోజుల్లో మరింత దూకుడుతో ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ రాజకీయాల్లో మార్పు తీసుకోస్తామని కోమటి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

4టీఆర్ఎస్ పార్టీలో చేరికపై క్లారిటీ

4టీఆర్ఎస్ పార్టీలో చేరికపై క్లారిటీ


టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ వ‌స్తున్న పుకార్ల‌పై కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి వివ‌ర‌ణ ఇచ్చారు.
తాను పచ్చి కాంగ్రెస్ పార్టీ వాదినని తెల్చిచెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఎంపీగా మాత్రమే సీఎం కేసీఆర్‌తో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నానని తెలిపారు. కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే భువనగిరి నియోజకవర్గం ఉన్నాఅభివృద్దిని టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేద‌ని విమర్శించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలకు చెక్ ప‌డింది.

ఇద్ద‌రి క‌ల‌యిక పార్టీ శ్రేణుల‌కు కొండంత ధైర్యం

ఇద్ద‌రి క‌ల‌యిక పార్టీ శ్రేణుల‌కు కొండంత ధైర్యం

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల కలయికపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి పోరాటం చేస్తే తెలంగాణ కాంగ్రెస్‌కు .. కార్యకర్తలకు కొండంత ధైర్యం వస్తుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కలయిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో మరింత నూతనోత్సాహన్ని నింపుతుందన్నారు. ఇది శుభ పరిణామం అంటూ ట్విట్ చేస్తున్నారు.

English summary
Congress MP Komatireddy venkata reddy comments on revanth reddy meets
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X