ఏ లుచ్ఛాలు, ఏ లఫంగాలు పాలిస్తున్నారు?: కేసీఆర్‌పై ఉత్తమ్ ఇలా!..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలంతా వరుసపెట్టి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కేసీఆర్ బాహుబలి కాదు బఫూన్ అని సర్వే సత్యనారాయణ కామెంట్ చేస్తే.. తెలంగాణను ఏ లుచ్చా, లఫంగాలు పాలిస్తున్నారంటూ టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరింత ఘాటుగా స్పందించారు.

రైతులకు గిట్టుబాటు ధర లేక మార్కెట్ అధికారులపై తిరగబడుతున్న నేపథ్యంలో.. ఏ లుచ్చాల పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఉత్తమ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనలో మిర్చి రైతుకు లాఠీ ఛార్జీలు, పసుపు రైతుకు ఆత్మహత్యలే మిగిలాయని మండిపడ్డారు.

Tpcc chief uttam kumar fires on Kcr over farmers issue

కాంగ్రెస్ శ్రేణులను దద్దమ్మలు, సన్నాసులు అంటూ కేసీఆర్ ఆగ్రహించిన తీరును ఉత్తమ్ పరోక్షంగా తప్పుపట్టారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ నేతలను తరిమికొట్టడానికి సిద్దంగా ఉన్నారని, కేవలం ప్రతిపక్ష నేతలను తిట్టడానికే కేసీఆర్ పరిమితమయ్యారని అన్నారు.

రెండు లక్షల బస్తాల మిర్చి ఖమ్మం మార్కెట్ యార్డులో ఉంటే సీఎం కనీసం స్పందించరా? అని నిలదీశారు. భూసేకరణ బిల్లుకు మద్దతు కోసం టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ముందు రైతులకు మద్దతు ధర గురించి మాట్లాడిన తర్వాతే అసెంబ్లీలో భూసేకరణ బిల్లుపై మాట్లాడుతామన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TPCC Chief Uttham Kumar Reddy fired on Kcr over farmers problems in the state. He demanded govt to take actions to paid enough

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి