టార్గెట్ కేసీఆర్ ..రేవంత్ కు పగ్గాలు: టీపీసీసీ- కొత్త కమిటీ : కోమటిరెడ్డికి దక్కని స్థానం..!!
అనేక తర్జన భర్జనల తరువాత ఏఐసీపీ ఎట్టకేలకు తెలంగాణ కార్యవర్గాన్ని ప్రకటించింది. ముందు నుండి అంచనా వేస్తున్న విధంగానే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా..పక్కన పెట్టి రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించింది. దీంతో..పాటుగా పార్టీ సీనియర్లకు కీలక బాధ్యతలు కేటాయించింది. రేవంత్ రెడ్డి టీం లో సీనియర్లు...సామాజిక సమతుల్యత పాటిస్తూ జాబితా ప్రకటించారు. టార్గెట్ కేసీఆర్-2023 మిషన్ తో పని చేయనున్న రేవంత్ రెడ్డి టీంలో అయిదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉండనున్నారు.
Recommended Video

వర్కింగ్ ప్రెసిడెంట్లుగా..
అందులో ఎమ్మెల్యే జగ్గారెడ్డి..మాజీ మంత్రి డాక్టర్ జే గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అజాహరుద్దీన్, మహేష్ గౌడ్ లను నియమిస్తూ ఏఐసీపీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ప్రచార కమిటీ ఛైర్మన్ గా బీసీ వర్గానికి చెందిన మాజీ ఎంపీ మధు యాష్కీకి అవకాశం కల్పించింది. ఆయన సైతం పీసీసీ అధ్యక్ష పదవి కోసం రేసు లో నిలిచారు. తెలంగాణలో బీసీ ఫ్యాక్టర్ ను పరిగణలోకి తీసుకొని ఈ పదవిని కట్టబెట్టారు. ఆయన తో పాటుగా మైనార్టీ వర్గానికి చెందిన సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీకి కన్వీనర్ గా అవకాశం ఇచ్చారు.

సీనియర్లకు స్థానం..
ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కు అవకాశం దక్కింది. సీనియర్ ఉపాధ్యక్షులుగా... సంభాని చంద్రశేఖర్, దామోదర్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి, పోడెం వీరయ్య, సురేష్ షెట్కర్, వేం నరేందర్ రెడ్డి. రమేష్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, టీ కుమార రావు, జావీద్ అమీద్ ఉన్నారు. వీరి పేర్లను ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ నేతలందరి ఎంపికలోనూ రేవంత్ రెడ్డి చాయిస్ కే ఏఐసీసీ ఓటు వేసినట్లు తెలుస్తోంది.

కోమటిరెడ్డికి ఇచ్చిన హామీ ఏంటి
అయితే, చివరి నిమషం వరకు రేవంత్ కు పోటీ ఇచ్చి..ఒక దశలో పీసీసీ పీఠం ఖాయమని ప్రచారం సాగిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ కమటీలో స్థానం దక్కలేదు. ఆయనకు తెలంగాణలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగింది. అయితే, కోమటిరెడ్డికి ఏఐసీసీలో స్థానం కల్పిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏఐసీపీ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ ఛైర్మన్ గా ఆలేటి మహేశ్వర్ రెడ్డిని నియమించారు. ఇక, రేవంత్ నియామకం పైన పార్టీలోని అందరు సీనియర్లతో చర్చలు చేసిన తరువాతనే ఏఐసీసీ అధికారికంగా ప్రకటించినట్లు సమాచారం. మరి..వీహెచ్ లాంటి సీనియర్ల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications