పోర్న్ చిత్రాలు చూపిస్తూ రేప్ చేసిన యజమాని

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పదకొండేళ్ల బాలికను మాయమాటలతో నమ్మించి అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన వ్యక్తి వయస్సు 50 ఏళ్లు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. మైలార్ దేవులపల్లిలోని చెత్తగోదాం యజమాని అన్వర్ ఖాన్ రోజూ రాత్రి తొమ్మిది గంటల వరకు గోదాంలోనే ఉండేవాడు.

గోదాం సమీపంలోనే నివాసముండే పదకొండున్నరేళ్ల బాలిక తల్లి కూడా అక్కడ పని చేస్తోంది. తల్లితో పాటు అక్కడకు వెళ్లే బాలిక.. అన్వర్ ఖాన్ గదిలో టీవీ చూసేది. శుక్రవారం రాత్రి కూడా ఆ చిన్నారి టీవీ చూసేందుకు అన్వర్ ఖాన్ గదిలోకి వెళ్లింది. టీవీ చూస్తున్న బాలికకు అతను బ్లూఫిలిమ్స్ చూపించాడు.

నీలి చిత్రాలు చూపిస్తూ ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. తమ కుమార్తే అత్యాచారానికి గురైందని తల్లిదండ్రులు.. అన్వర్ గదికి వెళ్లారు. అతను అక్కడి నుండి పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్వర్ ఖాన్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. బాధితురాలని ఆసుపత్రికి తరలించారు.

Trader rapes staffer's kid

వైద్యురాలిపై అత్యాచారయత్నం

ఓ హోటల్‌లో బస చేసేందుకు వచ్చిన వైద్యురాలిపై అర్ధరాత్రి పక్క గదిలో మద్యం సేవించి వచ్చిన దుండగులు అత్యాచారానికి యత్నించారు. ఎల్బీ నగర్‌లోని ఓ ఆస్పత్రిలో ప్రసంగించడానికి ముంబై నుంచి వైద్య ప్రముఖుడితో పాటు మరో వైద్యురాలు నగరానికి వచ్చారు. వారికి ఎల్బీ నగర్లో ఓ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు.

వైద్యురాలికి 405 గది కేటాయించారు. గది నెంబర్ 404లో భూపాల్ రెడ్డి అనే వ్యక్తి గదిని అద్దెకు తీసుకుని తన స్నేహితులు యాదగిరి, నర్సింహ, దిలీప్‌ లతో కలిసి రాత్రి మద్యం సేవించారు. అర్ధరాత్రి దాటాకా నలుగురు కలిసి ఒక్కసారిగా 405 గది తలుపు నెట్టి లోపలికి ప్రవేశించారు. ఆమెపై అత్యాచారానికి యత్నించారు. ఆమె గట్టిగా ప్రతిఘటించి కేకలు వేయడంతో.. హోటల్‌ సిబ్బంది, ఇతర గదుల్లోని వ్యక్తులు బయటికి వచ్చారు. దీంతో ఒక్కరు మినహా మిగతా అందరూ పరారయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+