హైదరాబాద్‌ లో రేపు ట్రాఫిక్ జామ్ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్తే ఇక అంతే..!

హైదరాబాద్ మహా నగరంలో నవంబర్ 2 న బీజేపీ నిర్వహించ తలపెట్టిన 'మహా పాదయాత్ర' నేపథ్యంలో అధికారులు హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ మహాపాద యాత్ర జరగనుంది. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మోజాంజాహి మార్కెట్ వరకు ఈ పాదయాత్ర సాగనుంది. ఈ మేరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు నగరంలోని ప్రధాన కూడళ్లు, మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం వివరణ ఇచ్చింది. ఈ క్రమంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించింది.

హైదరాబాద్ నగరంలోని లిబర్టీ, రవీంద్ర భారతి, ఏఆర్ పెట్రోల్ పంప్, బషీర్‌ బాగ్, బీజేఆర్ విగ్రహం, ఎస్‌ బీఐ గన్‌ ఫౌండ్రీ, జీపీఓ, నాంపల్లి టీ-జంక్షన్, తాజ్ ఐలాండ్, ఎంజే మార్కెట్, అఫ్జల్‌ గంజ్, జాంబాగ్‌ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు తీవ్ర ప్రభావం పడే ప్రధాన రహదారులుగా పీటీఐ నుంచి రవీంద్ర భారతి కర్బలా జంక్షన్ అలాగే రవీంద్ర భారతి కట్ట మైసమ్మ.. అలాగే చిక్కడపల్లి నారాయణగూడ చివరగా లిబర్టీ సిమెట్రీ జంక్షన్ నుంచి హెచ్‌ టీపీ మార్గాలను గుర్తించారు. అలాగే బషీర్‌ బాగ్ నుంచి బ్యాంక్ స్ట్రీట్.. రామ్‌ కోటి నుంచి అబిడ్స్ పాత అంబేడ్కర్ విగ్రహం నుంచి డీఎంహెచ్ ఎస్, పంజాగుట్ట నుంచి సచివాలయం తదితర మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండనుంది.

Traffic news restrictions in Hyderabad tomorrow due to the Maha Padayatra avoid these routes

మరోవైపు రవీంద్ర భారతి, ఎంజే మార్కెట్, అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను ప్రత్యామ్నాయ రూట్లలో మళ్లిస్తున్నారు. అలాగే రాణిగంజ్, అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే జిల్లా ఆర్టీసీ బస్సులను సీటీఓ జంక్షన్, రసూల్‌ పురా, బేగంపేట మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక సూచనలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+