సదానంద మాట: హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్నది చంద్రబాబే
న్యూఢిల్లీ: హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనా? అవునని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ చెప్పినట్లు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి అంటున్నారు. రాష్ట్ర విభజనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన గురువారం మీడియాతో అన్నారు.
అంశాలవారీగా తాము కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. హైకోర్టు, విద్యా సంస్థల విభజన విషయంలో తమకు న్యాయం జరగడం లేదని చెప్పారు. అధికారుల విభజనలో కూడా తెలంగాణకు తగిన న్యాయం జరగడం లేదని చెప్పారు. విభజన సమస్యలపై చర్చించేందుకు తమ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు 9 సార్లు ప్రధాని నరేంద్ర మోడీని కలిసినట్లు ఆయన తెలిపారు.
ఉమ్మడి హైకోర్టు విభజనలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తోందని తెలంగాణ న్యాయవాదుల జెఎసి కో-కన్వీనర్ టి.శ్రీరంగారావు ఆరోపించారు. ఇందుకు నిరసనగా జూన్ 6 నుంచి ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని చెప్పారు. హైకోర్టు విభజన అంశం న్యాయస్థానంలో ఉన్న నేపథ్యంలో అవసరమైతే ఆర్డినెన్స్ ద్వారా విభజించాలని డిమాండ్ చేశారు.

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన బిజెపి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కనీసం హైకోర్టును విభజించలేక పోతోందని ఆయన బుధవారం మీడియాతో అన్నారు.
న్యాయవ్యవస్థ నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండు చేశారు. 60:40 నిష్పత్తి పాటించాలని, దిగువ న్యాయస్థానాల్లో ఏ ప్రాంతం వారిని అక్కడే న్యాయమూర్తులుగా నియమించాలని కోరారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications