వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాధాకృష్ణ వర్సెస్ కెసిఆర్ గొడవ ముదురుతోంది!: దిష్టిబొమ్మ దగ్ధం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ దిష్టిబొమ్మను ఆదివారం నాడు పలుచోట్ల దగ్ధం చేశారు. హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ తదితర జిల్లాలోని కొన్ని చోట్ల రాధాకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాధాకృష్ణ పత్రిక విలువలు దిగజారుస్తున్నారని ఆరోపించారు.

కెసిఆర్‌ను సిబిఐ ప్రశ్నించిన నేపథ్యంలో... ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పటి నిర్ణయాలు వివాదాస్పదమంటూ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రచురిస్తోంది. దీనికి కౌంటర్‌గా వీణ - వాణిల ఆపరేషన్ ఖర్చు కోసం అంటూ విరాళాలు వసూలు చేసి రాధాకృష్ణ ఇవ్వలేదని నమస్తే తెలంగాణ కథనాలు రాస్తోంది.

ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ కార్యకర్తలు రాధాకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు రాధాకృష్ణకు అలాగే కనిపిస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి మండిపడ్డారు. సమాజానికి కీడు చేయవద్దన్నారు.

రాధాకృష్ణ దిష్టిబొమ్మ దగ్ధం

రాధాకృష్ణ దిష్టిబొమ్మ దగ్ధం

ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ దిష్టిబొమ్మను పలుచోట్ల దగ్ధం చేశారు. హైదరాబాదులోని పంజాగుట్ట ప్రాంతంలో దిష్టిబొమ్మ దగ్ధం దృశ్యం.

 రాధాకృష్ణ దిష్టిబొమ్మ దగ్ధం

రాధాకృష్ణ దిష్టిబొమ్మ దగ్ధం

సేవ పేరుతో విరాళాలు వసూలు చేస్తూ, లబ్ధిదారులకు ఇవ్వకుండా మోసం చేశారని రాధాకృష్ణ పైన టిఆర్ఎస్ నాయకులు నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రాధాకృష్ణ దిష్టిబొమ్మ దగ్ధం

రాధాకృష్ణ దిష్టిబొమ్మ దగ్ధం

అవిభక్త కవలలు వీణా వాణిల కుటుంబానికి చేయూతనిచ్చేందుకు దాతల నుంచి సేకరించిన విరాళాలను వారి తల్లిదండ్రులకు ఇవ్వకుండా మోసానికి పాల్పడ్డారని టిఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

 రాధాకృష్ణ దిష్టిబొమ్మ దగ్ధం

రాధాకృష్ణ దిష్టిబొమ్మ దగ్ధం

రాధాకృష్ణ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్కేవీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయ లక్ష్మి డిమాండ్ చేశారు.

English summary
Activists burns effigy of Andhrajyothy MD Radhakrishna on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X