11వ రౌండ్‌లో టీఆర్ఎస్ లీడ్, టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. మొత్తం 15 రౌండ్లు కాగా.. 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 15వ రౌండ్‌లో కేవలం రెండు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అంటే మరో మూడు రౌండ్లను లెక్కించాల్సి ఉంది. అంటే టీఆర్ఎస్ పార్టీకి 5767 ఓట్ల లీడింగ్ ఉంది. మిగతా రౌండ్లలో కూడా మిక్స్‌డ్ ఫలితం రానుంది. దాంతో బీజేపీ బలపడి.. విజయం సాధించే అవకాశం తక్కువ.

11వ రౌండ్‌ ముగిసే సరికి టీఆర్ఎస్ పార్టీకి 74, 594 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 68, 800 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 16 వేల 280 ఓట్లు వచ్చాయి. 11వ రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 7235 ఓట్లు వచ్చాయి. రాజగోపాల్ రెడ్డికి 5877 ఓట్లు వచ్చాయి.

trs cadre are josh, perform dance

ఇటు తమ పార్టీ విజయం ఖాయం అనుకొని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగారు. రంగులు చల్లి.. డ్యాన్స్ చేసి తెగ హడావిడి చేస్తున్నారు. పార్టీ కార్యాలయాల వద్ద పండగ వాతావరణం నెలకొంది. శ్రేణులు అందరూ జోష్‌తో ఉన్నారు. ఓ మహిళా కార్యకర్త జోరుగా డ్యాన్స్ చేస్తోంది. ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వెనకాల ఉన్న వారంతా జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+