అక్కడికి వెళ్తే... టీఆర్ఎస్ నేతలను చెప్పులతో కొడుతారు.. మానవత్వం ఉంటే ఆ పనిచేయండి : దాసోజు శ్రవణ్

టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో విద్య,వైద్యం,ఉపాధి రంగాలను గాలికొదిలేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. రాష్ట్రంలో 4500 ప్రభుత్వ స్కూళ్లను మూసివేశారని అన్నారు. ఇప్పటికీ చాలా స్కూళ్లలో టీచర్లు లేరని... యూనివర్సిటీల్లోనూ 60శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. టీచర్లు లేని స్కూళ్లకు,లెక్చరర్లు లేని కాలేజీలకు మీ పిల్లలను పంపిస్తారా అంటూ టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలకు చదువురావొద్దు... వారు బానిసల్లా ఉండాలనే ప్రభుత్వం కుట్రపూరితంగా విద్యను నిర్వీర్యం చేస్తోందన్నారు.

ఏడేళ్లుగా దళితుల,గిరిజనుల నోళ్లలో మన్ను కొట్టినవాళ్లు ఇప్పుడు దళిత బంధు ఎలా అవుతారని శ్రవణ్ ప్రశ్నించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను మళ్లించి.. ఆ చట్టాన్ని తుంగలో తొక్కినవారు దళిత బంధు అమలుచేస్తామంటే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.రూ.40వేల కోట్లు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు పెట్టని ప్రభుత్వం ప్రతీ దళిత కుటుంబానికి రూ.10లక్షలు ఇస్తామంటే ఎలా నమ్ముతారని అన్నారు.

trs govt failed to provide education employment and medication says dasoju shravan

హుజురాబాద్‌లో టీఆర్ఎస్ శీర్షాసనమేసినా ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదన్నారు. అందుకే ఇష్టమొచ్చిన పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని... ఇప్పటికీ నిరుద్యోగ సమస్యను పట్టించుకోవట్లేదని అన్నారు. బిశ్వాల్ కమిటీ 1లక్షా 91 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని రిపోర్ట్ ఇస్తే... సీఎస్ సోమేశ్ కుమార్ మాత్రం 56వేల పోస్టులే ఉన్నాయని చెబుతున్నారన్నారు. ఇది నిరుద్యోగుల నోటిలో మన్ను కొట్టడమేనన్నారు.

కొత్త ఉద్యోగాల సంగతి పక్కనపెడితే ఉన్న ఉద్యోగాలే తొలగిస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 52వేల మంది ఉద్యోగులను తొలగించారని అన్నారు. 7560 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తే ఇవాళ వారు ధర్నా చేపట్టారని గుర్తుచేశారు. తమపై దాడి చేస్తున్న దళిత ఎమ్మెల్యేలు ఈ సమస్యలపై కేసీఆర్‌ను ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. ఆ ఉద్యోగాలు కోల్పోయినవారిలో దళితులే ఎక్కువమంది ఉన్నారని అన్నారు. దమ్ముంటే కేసీఆర్‌పై కొట్లాడాలని తమపై కాదని అన్నారు. టీఆర్ఎస్ నేతలు దురహంకారం,స్వార్థంతో మాట్లాడుతున్నారని... తాము నిజాయితీతో,తపనతో,ధర్మం కోసం మాట్లాడుతున్నామని చెప్పారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో ఈ నాలుగైదేళ్లలో 14 మంది నిరుద్యోగులు చనిపోయారని చెప్పారు. ఒకసారి వారి ఇళ్ల వద్దకు వెళ్లి నిలబడితే టీఆర్ఎస్ నేతలను చెప్పులతో కొడుతారని అన్నారు.ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏమైనా మానవత్వం ఉంటే కనీసం ఇప్పటికైనా నిరుద్యోగ భృతి ఇప్పించేలా కేసీఆర్‌తో మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో ఎస్సీ,బీసీ కమిషన్ ఇప్పటికీ అపాయింట్ చేయలేదన్నారు.ప్రజల సొమ్ముతో టీఆర్ఎస్ చిల్లర డ్రామాలు ఆడుతోందన్నారు. రూ.1.20లక్షల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రంలోని లబ్దిదారులందరికీ డబుల్ బెడ్ రూమ్‌లు అందేవని... కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేక దాన్ని అమలుచేయట్లేదని అన్నారు.

గిరిజన,ఆదివాసీల కోసం హెలికాప్టర్ అంబులెన్సులు తెస్తానని 2014లో కేసీఆర్ చెప్పారని...ఇప్పటికీ ఆదిలాబాద్,ఆసిఫాబాద్ ప్రాంతాల్లో కనీస వైద్య సౌకర్యాలు లేవని అన్నారు. ఐటీడీఎస్‌కు నిధులు కేటాయించక దాన్ని నాశనం చేశారని విమర్శించారు. గ్రామాల్లో హరితహారం,వైకుంఠ ధామాల పేరిట ఎస్సీ,ఎస్టీల భూములను గుంజుకుంటున్నారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+