ఎన్టీఆర్: కెసిఆర్‌తో ఆ విషయం చెప్పలేకపోయిన బాలకృష్ణ! టి-టిడిపి ఆందోళన

హైదరాబాద్: ఎన్టీఆర్ ఘాట్ వద్ద సదుపాయాలు సరిగా లేవని తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ... ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసినప్పుడు మాత్రం దాని గురించి చర్చించలేదని తెలుస్తోంది.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద సదుపాయాలపై బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత కెసిఆర్‌ను కలిశారు. బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి గురించి, నిర్మాణాల క్రమబద్ధీకరణ గురించి, తన సినిమాల గురించి మాట్లాడిన బాలకృష్ణ.. ఘాట్ వద్ద పరిస్థితి గురించి మాత్రం మాట్లాడలేదని తెలుస్తోంది.

TRS insults NTR on death anniversary: TDP leaders

బాలకృష్ణతో భేటీ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ... తాను ఎన్టీఆర్, ఎఎన్నార్ సినిమాలను బాగా చూసేవాడినని చెప్పారు. అలాగే మోక్షజ్ఞను సినిమాల్లో పరిచయం చేయనున్నట్లు బాలకృష్ణ తెలిపారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద సౌకర్యాల పైన వైసిపి నేత లక్ష్మీపార్వతి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఏకంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆందోళనకు దిగారు.

TRS insults NTR on death anniversary: TDP leaders

మహనీయుడైన ఎన్టీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందని గ్రేటర్ హైదరాబాద్ టిడిపి అధ్యక్షులు మాగంటి గోపినాథ్ విమర్శించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా కనీస ఏర్పాటు కూడా చేయలేదని ఆయన అన్నారు. మాగంటి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో నేతలు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. రాజకీయ జీవితం ప్రసాదించిన ఎన్టీఆర్‌ను కేసీఆర్‌ విస్మరించడం దారుణమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+