టీఆర్ఎస్‌కు షాక్: బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్, కండువా కప్పిన అమిత్ షా
Recommended Video

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ గట్టి షాక్ తగిలింది. టీఆర్‌ఎస్ నేత, ఆందోల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారం ఉదయం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్‌తో కలిసి బాబుమోహన్ ఢిల్లీ వెళ్లారు.
శనివారం మధ్యాహ్నం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా.. బాబుమోహన్‌కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అందోల్ నుంచి గెలుపొందన బాబుమోహన్‌కు తాజా ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే.

అసెంబ్లీ రద్దు అనంతరం 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన కేసీఆర్.. అందోల్ టికెట్‌ను బాబు మోహన్‌ను కాదని జర్నలిస్టు క్రాంతి కుమార్‌కు ఇచ్చారు. ఈ క్రమంలో ఎంత కష్టపడి పనిచేసినా కూడా టీఆర్‌ఎస్ పెద్దలు తనపై వివక్ష చూపుతున్నారని బాబుమోహన్ తన సన్నిహితుల వద్ద విచారం వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్ టికెట్ నిరాకరిచండంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన.. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అందోల్ టికెట్ ఇస్తామని బీజేపీ నుంచి తనకు హామీ లభించడంతోనే ఆయన ఢిల్లీ వెళ్లి కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం అందోల్ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో బాబుమోహన్ చేరిక తమకు లాభిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications