Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నా వేధింపుల వెనక టీఆర్ఎస్ నేతలు.!దత్తత తీసుకోలే.!పెంచుకోవట్లే.!కలిసి జీవిస్తున్నామన్న కరాటే కళ్యాణి.!

హైదరాబాద్ : ఒక్క చెంప దెబ్బ నటి కరాటే కళ్యాణీని కమీషనరేట్ వరకూ లాక్కెళ్లింది. ఒకరకంగా తనకు సంబంధం లేని అంశంలో జోక్యం చేసుకుని నరక యాతన అనుభవిస్తోంది కళ్యాణి. సమాజంలో మనకు నచ్చని సంఘటనలు జరిగిపోతున్నప్పుడు ఎదుటి వారికి నచ్చజెప్పడంలో కొన్ని పద్దతులు ఉంటాయి. అవి అతిక్రమిస్తే పరకిస్థితి కరాటే కళ్యణి లాగే ఉంటుంది. ఎందుకోసం నడిరోడ్డు మీద రచ్చ చోటుచేసుకుంది.?ఎందుకు కరాటే కళ్యాణి అజ్ఞాతంలోకి వెళ్లారు.?వెళ్లిన తర్వాత చిన్న పాపతో సహా తల్లిదండ్రులను వెంటతీపుకొని హైదరాబాద్ కలెక్టరేట్ కు ఎందుకు వచ్చారు.?ఇవన్నీ కళ్యాణీ దుందుడుకు వ్యవహానికి తగిన మూల్యం కాదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

 చిచ్చుపెట్టిన చెంప దెబ్బ.. కరాటే కళ్యాణిని కలెక్టరేట్ కు లాగిన యవ్వారం

చిచ్చుపెట్టిన చెంప దెబ్బ.. కరాటే కళ్యాణిని కలెక్టరేట్ కు లాగిన యవ్వారం

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు చేటయ్యిందటారు. కరాటే కళ్యాణి అంశంలో ఇదే జరిగినట్టు తెలుస్తోంది. ఏదైనా సమస్యను పూర్తి స్దాయిలో సమూలంగా తొలగించాలి లేదా మనకెందుకులే అని వదిలెయ్యాలి.. రెండూ కాకుండా సినిమలో కధానాయిక మాదిరి కెలికి వదిలేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి తప్పు లేకున్నా తొందరపాటు చర్యల వల్ల నలుగురిలో పరువుపోగొట్టుకునే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ప్రాంక్ వీడియోలు చేసుకునే శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని డీల్ చేయడంలో మిస్ ఫైర్ ఐన కరాటే కళ్యాణి అందుకు తగ్గట్టుగానే కష్టాలు కొని తెచ్చుకుంది.

 అసలు అంశం పక్కదారి పట్టింది.. ఉచ్చులో ఇరుక్కున్న కళ్యాణి ..

అసలు అంశం పక్కదారి పట్టింది.. ఉచ్చులో ఇరుక్కున్న కళ్యాణి ..


ప్రాంక్ వీడియోలు చేసుకునే శ్రీకాంత్ రెడ్డిని చెంప ఛెళ్లుమనిపించిన కళ్యాణికి దాని రీ సౌండ్ మాత్రం ఆమె ఇంట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. శ్రీకాంత్ ప్రాంక్ రచ్చ కళ్యాణి కెరీర్ లో మాయని మచ్చలా మారింది. శ్రీకాంత్ అంశంలో కళ్యాణి ఒకటి అనుకుంటే అయ్యింది మరోకటి. తన వ్యక్తి గత జీవితం గురించి, తన ఇంట్లో పెరుగుతున్న చిన్నారుల గురించి విచారణ సంస్థలకు వివరణ ఇచ్చుకునే వరకూ కళ్యాణికి వ్యతిరేకంగా వ్యవహారం ముదిరిందంటే కళ్యాణి ఎంత ఆవేశపడింతో అర్ధం అవుతోంది. మీడియా చర్చలకు ఒంటికాలితో పరుగెత్తి, స్టూడియోలో గొంతెత్తి అరిచి, తిట్టి, ఎదుటివారిని కొట్టేంతపనిచేసే కళ్యాణి ఇప్పుడు అదే మీడియాను చూసి రెండు చేతులెత్తి దండం పెడుతోంది. తనను వదిలేయండి బాబూ అని ప్రాధేయపడుతోంది.

 ముదిరిన దత్తత వ్యవహారం.. పిల్లా పెద్దలతో కలెక్టరేట్ కి చేరుకున్న కళ్యాణి

ముదిరిన దత్తత వ్యవహారం.. పిల్లా పెద్దలతో కలెక్టరేట్ కి చేరుకున్న కళ్యాణి


అసలు ప్రాంక్ వీడియోలు తీసుకునే శ్రీకాంత్ రెడ్డి వ్యవహారం పక్కకు వెళ్లి కళ్యాణి కహానీ ఏంటి.? కళ్యాణి దందా ఏంటి.?బ్లాక్ మెయిల్ వ్యవహారాలేంటి.?అనే వ్యక్తిగత అంశాలపై వివరణ ఇచ్చకోవాల్సిన పరిస్ధితులు తలెత్తాయి. అవన్నీ కాకుండా కరాటే కళ్యాణి ఇంట్లో పెరుగుతున్న ఆరేళ్ల చిన్న పాప ఎవరు?ఆపాపను మొదట కళ్యాణి దత్తత తీసుకుని పెంచుకుంటున్నట్టు స్వయంగా మీడియాముందు ప్రకటించారు. తర్వాత దత్తత అంశంలో ఉన్న నిబంధనలను కళ్యాణి పాటించారా.?లేదా అనే అంశం తెరమీదకు వచ్చింది. ఈ అంశంలోనే కళ్యాణి మాట మార్చనట్టు స్పష్టంగా తెలుస్తోంది. న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు పాప తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్ కలెక్టరేట్ కు చేరుకున్నారు కరాటే కళ్యాణి.

 కావాలనే వివదాలు.. టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందన్న కరాటే కళ్యాణి

కావాలనే వివదాలు.. టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందన్న కరాటే కళ్యాణి


హైదరాబాద్ కలెక్టర్ కార్యలయంలోని చిల్డ్రన్ వెల్ ఫేర్ కమీషన్ ముందుకు కల్యాణి హాజరయ్యారు. పాప దత్తత అంశంలో వివరణ ఇవ్వాలని కమీషన్ నోటీస్ ఇవ్వడంతో కల్యాణి తాను పెంచుకుంటున్న పాప, పాప తల్లిదండ్రులతో సహా కమీషన్ ముందుకు హాజరయ్యారు. ఈసందర్బంగా కళ్యాణి మీడియా పైన చిందులు తొక్కారు. తన మీద అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని, ఏది తప్పో, ఏది ఒప్పో తెలుసుకోకుండా మీడియా వ్యవహరింస్తోందని మండి పడ్డారు. అంతే కాకుండా తనను వివాదాల్లోకి నెట్టేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందరికి త్వరలో సరైన సమాధానం చెప్తానని కళ్యాణి స్పష్టం చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+