ప్రియుడ్ని బెదిరించి యువతిపై రేప్: టిఆర్ఎస్ నుంచి రినాకర్ సస్పెండ్, ఆది నుంచీ నేర స్వభావమే

వరంగల్: ప్రేమజంటను బెదిరించి, యువతిపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న కూతాటి రినాకర్‌ను టిఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఆ పార్టీ శాయంపేట మండలాధ్యక్షులు గుర్రం రవీందర్‌ సోమవారం నాడు ప్రకటించారు. రినాకర్‌ తమ పార్టీ క్రియాశీల సభ్యులలో ఒకడన్నారు.

పార్టీ క్రమశిక్షణ చర్యలను ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ రోజు నుంచి రినాకర్‌కు తమ పార్టీతో (టిఆర్ఎస్)తో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

రినాకర్‌ది ఆది నుంచి నేర స్వభావమే

యువతిపై అత్యాచారానికి పాల్పడిన రినాకర్‌ది ఆది నుంచి నేర స్వభావమేనని పోలీసులు గుర్తించారు. హన్మకొండలో ఓ అమ్మాయిని వేధించిన సంఘటనలో గతంలోనే నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. శాయంపేటలో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో కేసు నమోదు చేశారు.

పరకాలలో ఓ ప్రయివేటు ఆసుపత్రిపై దాడిచేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేసిన ఘటనలో మరో కేసు పెట్టారు. ఇవే కాకుండా నిత్యం అమ్మాయిలను వేధించడం, బ్లాక్‌ మెయిల్‌ చేయడం అతడికి అలవాటుగా మారిందని పోలీసులు గుర్తించారు. కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

TRS leaders blackmail and rape in Warangal District

ఏం జరిగింది?

నిన్నటి వరకు తెరాస నాయకుడగా ఉన్న రినాకర్ ప్రేమ జంటను బెదిరించి యువతిపై అత్యాచారం జరిపిన సంఘటన వరంగల్ జిల్లా శాయంపేటలో జరిగింది. దీనిపై అత్యాచారానికి గురైన యువతితో పాటు ఆమె ప్రియుడు పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మిమ్మల్ని పోలీసులు వెంబడిస్తున్నారని నాతో వస్తే కాపాడుతానని ఆ ప్రేమజంటకు నమ్మించి, ఒంటరిగా యువతిని తీసుకెళ్లి గుట్టల్లో రినాకర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం మేరకు... శాయంపేటకు చెందిన ఓ బీటెక్‌ విద్యార్థి, హన్మకొండకు చెందిన ఓ యువతిని కొద్ది రోజులుగా ప్రేమిస్తున్నాడు.

డిసెంబరు 30న ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఆమెను శాయంపేటకు తీసుకొచ్చాడు. మైలారం రోడ్డుకు రాత్రివేళ వీరిద్దరూ కలిసి వెళుతుండగా ముగ్గురు యువకులు ఆపారు. ఎక్కడికి వెళుతున్నారంటూ ప్రశ్నించారు. ఈ ముగ్గురిలో ఒకడు శాయంపేటకు చెందిన టిఆర్ఎస్ యువజన విభాగం నేత రినాకర్‌‌కు ఫోన్‌చేసి అమ్మాయి, అబ్బాయి వెళ్తున్న విషయం చెప్పారు.

ఇంజినీరింగ్‌ విద్యార్థి కూడా రినాకర్‌కే ఫోన్ చేసి తమను ముగ్గురు అడ్డుకొని ప్రశ్నిస్తున్నారని వివరించాడు. వెంటనే బైక్ పైన అక్కడికి వచ్చిన రినాకర్‌ ఆ ముగ్గురిని అక్కడి నుంచి పంపించాడు. మీరు రాత్రి సమయంలో.. ఇలా తిరుగుతున్న విషయం పోలీసులకు, మీడియాకు తెలిసిందని, మీరు దొరికితే కేసులు పెడతారని నమ్మబలికాడు. ప్రేమికులను బెదిరించాడు.

దీంతో, ఆ ప్రేమికులు మీరే కాపాడాలని రినాకర్‌ను కోరారు. బండి ఇస్తే అమ్మాయిని ఇంట్లో దింపి వస్తానని రినాకర్‌ను ప్రేమికుడు వేడుకున్నాడు. బండి ఇవ్వడం కుదరదని, నేనే అమ్మాయిని వాళ్లింట్లో దింపి వస్తానని, చెప్పి ఆమెను తీసుకు వెళ్లాడు. తాను కూడా వస్తానని ప్రియుడి చెబితే వద్దన్నాడు.

రాత్రి పదకొండు గంటల సమయంలో యువతిని బైక్ పైన తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో రంగనాయకుల బోడు వద్ద యువతిని బెదిరించి అత్యాచారం చేశాడు. తర్వాత మాందారిపేట గుట్టలోని క్రషర్ల సమీపంలో రెండోసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి శాయంపేటలో ప్రేమికుడికి అప్పగించాడు. ఆమెను వాళ్ల ఇంటివద్ద దింపలేకపోయానని, నీవే తీసుకెళ్లి దింపి రమ్మని అతనికి రినాకర్ బైక్ ఇచ్చాడు. బండిపై వెళ్తుండగా అమ్మాయి అసలు విషయం చెప్పింది. ఆ కామాంధుడి చేతిలో పెట్టావని ఏడ్చింది.

అంతేకాదు, నేను అమ్మాయిని తీసుకు వెళ్తుంటే పోలీసులు, మీడియా వ్యక్తులు ఎదురయ్యారని, వారిని మేనేజ్‌ చేయడానికి రూ.60 వేలు ఖర్చు చేశానని, ఆ డబ్బులివ్వాలని కూడా మరుసటి రోజు ఉదయం నుంచే రినాకర్‌ ఆ ప్రియుడిని (ఇంజినీరింగ్‌ విద్యార్థి) బ్లాక్‌మెయిల్‌ చేశాడు. రూ.30వేలు ఇచ్చాడు. దీంతో పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+