వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగాది లాంటి జీవితాన్ని సమాధి చేసుకున్నాడు.!ఈటలపై టీఆర్ఎస్ నేతల ఫైర్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏడేళ్ల పాలన పై విపక్ష నేతలు అవగాహన లేమితో మాట్లాడుతున్నారని, ఏడేళ్లుగా దేశంలో ఎక్కడా లేని విదంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు స్పష్టం చేసారు. తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికల్లో గులాబీ పార్టీ చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడిగి అద్భుతమైన విజయాలు సొంతం చేసుకున్నామని వారు తెలిపారు.

Recommended Video

TOP NEWS : Congo | Etala Rajender | JP Nadda | Delta Variant
నీళ్లు,నిధులు,నియామకాల అంశంలో బీజేపి తప్పుడు ప్రచారం.. బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేతల ఫైర్..

నీళ్లు,నిధులు,నియామకాల అంశంలో బీజేపి తప్పుడు ప్రచారం.. బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేతల ఫైర్..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఏడేళ్ల టిఆర్ఎస్ పాలనపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడ్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పై బహిరంగ సవాల్ విసరుతున్నామని పల్లా రాజేశ్వర్ రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు స్పష్టం చేసారు. ఛాలెంజ్ స్వీకరించేందుకు బీజేపి నాయకులు సిద్దంగా ఉన్నారా అని ప్రశ్నించారు గులాబీ నాయకులు. ఏడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రవేఖర్ రావు ముందుచూపుతో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని వారు సూటిగా ప్రశ్రించారు.

దేశంలో ఏ పార్టీ చేయని సంక్షేమ పథకాలు అమలు.. బీజేపి నేతలపై మండిపడ్డ గులాబీ నేతలు..

దేశంలో ఏ పార్టీ చేయని సంక్షేమ పథకాలు అమలు.. బీజేపి నేతలపై మండిపడ్డ గులాబీ నేతలు..


రాష్ట్ర రైతాంగానికి సాగు నీరు, కరెంటు ఇవ్వడంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉన్నామని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. రైతులు పండించిన పంటను కొంటున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని ఇదే అంశం మీద బహిరంగ చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు గుడ్డు మీద ఈకలు పీకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రైతులు బిజెపి, కాంగ్రెస్ నాయకుల వ్యవహారం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని, నీళ్లపై సిగ్గు లేకుండా తప్పుడు ప్రచారాన్ని మొదలు పెట్టారని మండిపడ్డారు.

బీజేపికి పాలన చేతకాక అభివృద్దిలో వెనకబడింది.. ధ్వజమెత్తిన టీఆర్ఎస్ నాయకులు..

బీజేపికి పాలన చేతకాక అభివృద్దిలో వెనకబడింది.. ధ్వజమెత్తిన టీఆర్ఎస్ నాయకులు..


బీజేపీ పార్టీకి పాలన చేతగాక దేశ జిడిపి పడిపోయిందని, ఇది సిగ్గు చేటని తెలిపారు. నియమాకాల పై అబద్దాలు మాట్లాడితే బీజేపీ నాయకులకు గ్రాడ్యుయేట్ లు బుద్ధి చెప్పారని, అందుకు గత రెండు పట్ట భద్రుల ఎమ్మెల్సీల ఎన్నికలే నిదర్శనమని అన్నారు. అబద్దాలు మాట్లాడటానికి బండి సంజయ్ కి సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వెనకడుగు వేయలేదని స్పష్టం చేసారు. 20 ఏళ్లుగా చంద్రశేఖర్ రావు ఎందరో నాయకులను తయారు చేసారని వివరించారు.

కేసీఆర్ ఎన్నో పదవులు ఈటల కే కట్టబెట్టారు.. ఉగాది లాంటి జీవితాన్ని ఈటల సమాధి చేసుకున్నాడన్న పింక్ నేతలు..

కేసీఆర్ ఎన్నో పదవులు ఈటల కే కట్టబెట్టారు.. ఉగాది లాంటి జీవితాన్ని ఈటల సమాధి చేసుకున్నాడన్న పింక్ నేతలు..


ఈటెల రాజేందర్ కమ్యూనిజం భావాలను బిజెపి నాయకుల దగ్గర తాకట్టు పెట్టారా అని ప్రశ్నించారు. ఇవ్వాళ ఈటలను అందరూ ఛీ కొడుతున్నారని, మంత్రిగా చట్ట విరుద్ధ కార్యక్రమాలను ఎలా చేసారని ప్రశ్నిస్తున్నారు గులాబీ నేతలు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈటలను గౌరవించినట్టుగా ఎవరిని గౌరవించలేదని, ఎక్కువ పదవులు ఈటల కే కట్టబెట్టారని గుర్తు చేసారు. ఈటల క్షమించరాని నేరం చేసాడని, ఆయన వ్యవహరిస్తున్న తీరుకు పార్టీ పరంగా తప్పక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉగాది లాంటి జీవితాన్ని ఈటల రాజేందర్ స్వయంగా సమాధి చేసుకున్నారని పేర్కొన్నారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు.

English summary
Opposition leaders have spoken out against Chief Minister Chandrasekhar Rao's seven-year rule.TRS leaders have made it clear that welfare schemes are being implemented in Telangana like nowhere else in the country for seven years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X