'బాహుబలి'ని మించి... 'గులాబీ సభ' ఫీవర్‌: రేపే వరంగల్ సభ

వరంగల్‌: అన్ని చోట్ల బాహుబలి ముచ్చట్లే...! కానీ వరంగల్‌ నగరంలో మాత్రం గులాబీ సభ సందడి హవా కనిపిస్తోంది. నగరంలోని ప్రకాష్‌రెడ్డిపేటలో గురువారం తలపెట్టిన టీఆర్‌ఎస్‌ ప్రగతినివేదన సభకు కనీవినీ ఎరుగలని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కటౌట్లు, ఆర్చీలు, హోర్గింగ్‌లతో ఇప్పటికే నగరమంతా గులాబీమయంగా మారగా, సభా ప్రాంగణంలో హైటెక్‌ ఏర్పాట్లు అబ్బురపరుస్తున్నాయి. ఎండకు విరుడుడుగా 3,600 వాటర్‌ ఫాగింగ్‌ మెషిన్లను ఏర్పాటు చేస్తున్నారు.

TRS meeting in Warangal is Tomorrow

అలాగే ఫేస్‌బుక్‌లో లైవ్‌తోపాటు సభాస్థలిలో వైఫై సౌకర్యం, ఎల్‌సీడీ స్క్రీన్లు, ప్యారాట్రూపర్లు సిద్ధం చేస్తున్నారు. సౌండ్స్‌కు సంబంధించి ఫ్లయింగ్‌ సిస్టమ్‌ను వాడుతున్నారు.

గంటన్నపాటు నింగిలో సాగే క్రాకర్స్‌ షో అదనపు ఆకర్షణగా నిలువనుంది. వీటన్నింకీ తోడు కేసీఆర్‌ ఏమి ప్రసంగిస్తారనేది... కట్టప్పను మించిన ఉత్కంఠను కలిగిస్తోంది. సభకు ఒక్కరోజే వ్యవధి ఉండటంతో ఏర్పాట్లు చివరి దశకు చేరాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+