రాస్కెల్, యూజ్‌లెస్ ఫెల్లో: తహశీల్దార్‌పై టిఆర్ఎస్ ఎమ్మెల్యే కిశోర్ తిట్లదండకం
నల్లగొండ: నల్లగొండ జిల్లా తుంగతుర్తి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) శాసనసభ్యుడు గాదరి కిశోర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సభలో ఎమ్మెల్యే ప్రసంగిస్తున్న సమయంలో తహశీల్దార్ సెల్‌కు ఫోన్ రావడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వేదికపైనే తహశీల్దార్‌పై తిట్లదండకం అందుకున్నారు.
ఈ సంఘటన సోమవారం తిరుమలగిరి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. ఎంపిడివో కార్యాలయంలో దీపం పథకం కింద మంజూరైన సబ్సిడీ గ్యాస్ కనెక్షన్‌ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే డబుల్ బెడ్‌రూం ఇళ్లపథకం లబ్ధిదారుల ఎంపిక విషయం గురించి వివరిస్తుండగా తహశీల్దార్ దశరధకు ఫోన్ రావడంతో వేదిక దిగి ఫోన్ మాట్లాడి వచ్చారు.

దాంతో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే తహశీల్దార్ వైపు కోపంగా చూస్తూ తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగిస్తుండగా తహశీల్దార్‌కు రెండవసారి ఫోన్ రావడంతో తహశీల్దార్ వేదికపైనే ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే కిశోర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తహశీల్దార్‌పై తిట్ల దండకం అందుకున్నారు.
యూజ్‌లెస్‌ఫెలో, రాస్కెల్..అసలు చదువుకున్నావా, లేదా, హౌలా, అసలు నీకు తలకాయ పనిచేస్తుందా లేదా అంటూ శివాలెత్తిపోయారు. ఎమ్మె ల్యే చర్యతో వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, సభకు హాజరైన వారంతా నిశ్చేష్టులయ్యారు.












Click it and Unblock the Notifications