వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేదంటే రాజీనామా చేస్తా: కేసీఆర్‌కు సొంత పార్టీ ఎమ్మెల్యే ఝలక్!

|
Google Oneindia TeluguNews

రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సొంత పార్టీ ఎమ్మెల్యే ఒకరు షాకిచ్చారు. గద్వాల, జనగామ, సిరిసిల్ల, ములుగులను జిల్లాలుగా చేయాలని డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

తమ తమ జిల్లాల కోసం విపక్షాలు, జేఏసీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. అయితే కేసీఆర్‌కు మరో జిల్లా విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఝలక్ ఇచ్చారు. వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ఆ నియోజకవర్గ తెరాస ఎమ్మెల్యే సంజీవ రావు డిమాండ్ చేశారు.

TRS MLA ready to resign if Vikarabad not made district

వికారాబాదును జిల్లా కేంద్రంగా చేయకుంటే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్‌ను జిల్లాగా మారుస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ఒకసారి మాటిస్తే, దాన్ని తప్పే వ్యక్తి కేసీఆర్ కాదన్నారు. 19 మండలాలతో కూడిన వికారాబాద్ జిల్లా సాకారమవుతుందని, ఈ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గబోరన్నారు. జిల్లాను అడ్డుకునేందుకు కొందరు కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా గెజిట్ 28వ తేదీలోగా వస్తుందని, అలా రాకుంటే తాను రాజీనామా చేస్తానన్నారు.

English summary
TRS MLA Sanjeeva Rao ready to resign if Vikarabad not made district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X