Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇద్దరం కలిసి పని చేశాం, కేటీఆర్‌కు అదే చెప్పా: హరీష్ రావు, శాలువా కప్పిన కేకే కూతురు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఆయనకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ పార్టీ కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఆయనకు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ భవన్ వచ్చిన హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ తనను మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పారు. ఉదయాన్నే కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారని చెప్పారు. భవిష్యత్తులో కేటీఆర్ మరింత మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పారు. కేసీఆర్‌కు కేటీఆర్ చేదోడువాదోడుగా ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు.

Recommended Video

    Harish Rao Best Wishes to KTR for Appointed as TRS Working President | Oneindia Telugu
    రేపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలోను కలిసి పని చేస్తాం

    రేపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలోను కలిసి పని చేస్తాం

    స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత బాగా పని చేయాలని చేయాలని తనను కలిసిన కేటీఆర్‌కు సూచించానని హరీష్ రావు చెప్పారు. తామిద్దరం కూడా కలిసి పని చేస్తామని చెప్పారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇద్దరం కలిసి పని చేశామని చెప్పారు. రేపు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో కూడా పని చేస్తామని చెప్పారు.

    వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, హరీష్ రావు అభినందనలు (ఫోటోలు)

    ఉదయాన్నే శుభాకాంక్షలు తెలిపా

    ఉదయాన్నే శుభాకాంక్షలు తెలిపా

    కేటీ రామారావును వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం పైన హర్షం వ్యక్తం చేస్తున్నానని హరీష్ రావు చెప్పారు. తాను ఉదయాన్నే కేటీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పానని అన్నారు. భవిష్యత్తులో ఆయన మరింత మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. కాగా, హరీష్ రావు, కేటీఆర్‌లు కలుసుకున్న ఫోటోలను టీఆర్ఎస్ పార్టీ ఈ సందర్భంగా ట్వీట్ కూడా చేసింది.

    కేశవ రావును కలిసిన కేటీఆర్

    కేశవ రావును కలిసిన కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కే కేశవ రావును ఆయన నివాసంలో కేటీ రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను కేశవరావు కూతురు విజయ శాలువాతో సత్కరించారు. టీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు.

     సంతోష్ కుమార్ అభినందనలు

    సంతోష్ కుమార్ అభినందనలు

    తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్‌కు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అభినందనలు తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించినందుకు సీఎం కేసీఆర్‌కు సంతోష్ కుమార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఉపఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధించడంలో కేటీఆర్ కీలకపాత్ర పోషించారన్నారు. కేటీఆర్ నాయకత్వంలో మున్ముందు మరిన్ని విజయాలు సాధిస్తామని, పార్టీ బలోపేతం అవుతుందన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+