'సినిమా తీసుకుంటేనే.. రేవంత్ కల నెరవేరుతుంది'
రేవంత్ 'సీఎం' కల నెరవేరాలంటే.. సొంతంగా సినిమా నిర్మించుకుని.. అందులో సీఎం పాత్ర వేసుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు.
నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఉనికి మిణకు మిణుకుమంటున్న సంగతి తెలిసిందే. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒక్కరే పార్టీ గొంతు బలంగా వినిపిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై ఆయన చేస్తున్న విమర్శలు స్థాయికి తగ్గట్టుగా లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ఇదే విషయంపై స్పందించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి.. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.

తెలంగాణలో టీడీపీ పార్టీని కి.మీ లోతున బొందపెట్టారని మండిపడ్డారు. అలాంటి పార్టీకి నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి.. సీఎం అవుతానన్న కలల్లో బ్రతుకుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ 'సీఎం' కల నెరవేరాలంటే.. సొంతంగా సినిమా నిర్మించుకుని.. అందులో సీఎం పాత్ర వేసుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు.
నాగర్‌కర్నూల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications