పంజాబ్ ఉగ్రదాడి: పాక్‌ను నమ్మరాదని టీఆర్ఎస్ ఎంపీ కవిత ట్వీట్
హైదరాబాద్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున దాడి చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ ఎంపీ కవిత స్పందించారు. పాకిస్థాన్ ప్రేరిపిత ఉగ్రవాదులు ఈరోజు మళ్లికొసారి భారత్‌పై దుశ్చర్యకు పాల్పడ్డారు. పంజాబ్‌లోని మిలటరీ రక్షణ స్థావరంపై దాడికి పాల్పడ్డారు. ఒక సైనికుడు చనిపోయాడు. బాధాకరం. పాకిస్థాన్‌ను నమ్మరాదని అంటూ ట్వీట్ చేశారు.
Pakistan backed terrorists have once again attacked a military establishment in Punjab. One soldier dead.Terrible news. Can't trust Pakistan
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 2, 2016 పంజాబ్‌లో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై వారు దాడి చేశారు. శనివారం తెల్లవారుజామున పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. సైనిక దుస్తుల్లో ఎయిర్‌బేస్ వాహనంలో వచ్చిన ముష్కరులు ఒక్కసారిగా దాడికి దిగారు.
నలుగురు ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిఘటించాయి. ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఇద్దరు వైమానిక సిబ్బంది వీరమరణం పొందారు.

6 నెలల వ్యవధిలో ఇది రెండోసారి:
పంజాబ్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడటం 6నెలల వ్యవధిలో ఇది రెండో సారి. జులై 27న గురుదాస్‌పూర్ పోలీస్ స్టేషన్‌పై ముష్కరులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు వీరమరణం పొందారు. భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమించి ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టడంతో ఆపరేషన్ ముగిసింది. పంజాబ్‌లో వరుస ఉగ్రదాడులు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగిపోయారు. ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయన ఉన్నతాధికారులతో అత్యసవసరంగా భేటీ అయ్యారు. ఆపరేషన్ మొత్తాన్ని సమన్వయం చేస్తున్నారు.
ఉగ్రవాదుల దాడి, అనంతర పరిణామాలపై ఆరా తీస్తున్నారు. పెద్ద ఎత్తున బలగాలను పఠాన్‌కోట్‌లో మోహరించారు. భారత భద్రతాదళాల్లోనే అత్యున్నత నైపుణ్యం కలిగిన ఎన్ఎస్‌జీ, గరుడ కమాండో ఫోర్స్ దళాలు ఉగ్రవాదులపై కౌంటర్ ఎటాక్‌లో పాల్గొంటున్నాయి. పంజాబ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయంలో ప్రయాణికులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications