టీఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహక సభ..! ఈ నెల 14న ఆదిలాబాద్ కు కేటీఆర్..!!

ఆదిలాబాద్/ హైద‌రాబాద్ : ఈనెల 14న ఆదిలాబాద్ లో జరిగే టీఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహక సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. కేటీఆర్ సభ కోసం కార్యకర్తలను సమీకరించేందుకు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ముందస్తు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీలో నిర్వహించే సభకు 15వేల మందిని తరలించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు స్థానికి నేత‌లు.

తెలంగాణలో 16 పార్లమెంటు నియోజ‌క వ‌ర్గాల్లో గెలుపే ల‌క్ష్యంగా గులాబీ పార్టీ సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 14న సభ జరగబోతుంది. డైట్ కాలేజ్ గ్రౌండ్ లో ఆదిలాబాద్ ఎంపీ పరిదిలో ఉన్న ఏడు నియోజకవర్గాలు బోథ్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పుర్(టి) అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తల సమావేశం జరుగుతోంది.

TRS Parliamentary Preparatory Meeting..! KTR to Adilabad on this month 14 .. !!

వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మొదటిసారి జిల్లాకి వస్తున్న కేటిఆర్ కి ఘన స్వాగతం పలికేందుకు నేతలు, కార్యకర్తలు సిద్దమౌతున్నారు. అభ్యర్థి ఎవరైనా, భారీ మెజారిటీతో గెలిపిస్తామంటున్నారు ఆదిలాబాద్ గులాబీ నేతలు. కేంద్రంలో తెలంగాణ ఎంపీలు కీలకపాత్ర పోషించేలాంటే టీఆర్ఎస్ నే గెలిపించాలంటున్నారు జిల్లా నేతలు. ఈనెల 14న మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్.

సభలో 2 గంటల పాటు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన తర్వాత ముఖ్య నేతలతో సమావేశమౌతారు. రాత్రి ఆదిలాబాద్ లోనే బస చేసి ఉదయం రామగుండంలో జరిగే పెద్దపల్లి పార్లమెంట్ సన్నాహక సమావేశానికి వెళ్తారు కేటీఆర్. ఇదిలా ఉండ‌గా రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో ఒకరిద్దరు సిట్టింగ్‌ ఎంపీలకు టికెట్‌ ఇవ్వబోమని ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు స్పష్టం చేశారు . ఇవాళ జరిగిన లెజిస్లేచ‌ర్ పార్టీ సమావేశంలో మాట్లాడిన చంద్ర‌శేఖ‌ర్ రావు, పార్టీకి నష్టం చేసే ఏ ఒక్కరినీ ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు. ఇందులో భాగంగానే కొందరు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ఇవ్వనని తేల్చిచెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+