సీఎం కేసీఆర్ బతికిండగానే టీఆర్ఎస్ పార్టీని చంపుతాం : ఎంపీ అర్వింద్

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా మూడు సార్లు అధికారంలో కి రావడం కాదు, కేసీఆర్ పరిపాలన విధానంతో ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. మరోవైపు సీఎం కేసీఆర్ బతికుండగానే ఆయన పార్టీని పూర్తిగా చంపుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎంపీ అసదుద్దిన్ ఓవైసీకి సీఎం కేసీఆర్ చెంచాగా మారాడని విమర్శించారు.

ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ సీఎం కేసీఆర్ చెంచా

ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ సీఎం కేసీఆర్ చెంచా

తెలంగాణ విమోచన దినం వేడుకల్లో పాల్గోన్న బీజేపీ ఎంపీ అర్వింద్ సీఎం కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చెంచాలకు చెంచా అయినా ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దిన్ ఓవైసీకి సీఎం కేసీఆర్ చంచాగా మారాడని ఆయన ఆరోపించారు. విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా రాష్ట్ర అవరతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించాడు. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన కాలంలో కేసిఆర్ లేకపోవడంతో ఆయనకు పేరు రాదనే తెలంగాణ విమోచన దినోత్సవం ఉత్సవాలను జరుపలేదని అన్నారు.

కేసీఆర్ 100 ఏళ్లు బతకాలి, ఆయన పార్టీ చనిపోవాలి

కేసీఆర్ 100 ఏళ్లు బతకాలి, ఆయన పార్టీ చనిపోవాలి

మరోవైపు కేసీఆర్ చనిపోవాలని ప్రతిపక్షనాయకులు కోరుకుంటున్నారని కొట్టిపారేసిన ఆయన కేసీఆర్ నిండు నూరేళ్లు బ్రతకాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఎందుకంటే ఆయన బతికిండగానే టీఆర్ఎస్ పార్టీని పూర్తి చంపబోతున్నామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ చచ్చిపోవడాన్ని కేసీఆర్ కళ్లారా చూడాలని అన్నారు. మరోవైపు టీఆర్ఎస్‌లో ఉంటే భవిష్యత్‌ ఉండదని ఆపార్టీ నాయకులు ఆందోళన చేందుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ప్రయత్నం లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని అని జోస్యం చెప్పారు.

నిజామాబాద్ బాటలోనే గజ్వేల్,సిద్దిపేటలు చేరతాయి.

నిజామాబాద్ బాటలోనే గజ్వేల్,సిద్దిపేటలు చేరతాయి.

ఇక నిజామాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ ఎలాగైతే ఓటమి చవిచూసిన పార్టీ సిద్దిపేట్,గజ్వేల్,సిరిసిల్ల నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓటమి పాలు ఖావడం ఖాయమని ఆయన అన్నారు.ఈ నేపథ్యలంలోనే సీఎం కేసీఆర్ రాష్ట్రానికి పట్టిన శాపమని, అన్నారు. కేసీఆర్‌కు పాలనపై పట్టు లేదని విమర్శించారు. దీంతోపాటు ఇతర పార్టీలోకి వస్తున్న వారిని సీఎం కేసిఆర్ బెదిరిస్తున్నాడని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+