కెసిఆర్‌పై వ్యాఖ్యలు: నారా లోకేష్‌ను టార్గెట్ చేసిన టిఆర్ఎస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులు తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌ను లక్ష్యం చేసుకున్నారు. తమ పార్టీపై, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై టిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ బాబు అంటూ వ్యాఖ్యానించారు.
నారా లోకేష్ ట్విట్టర్‌లో తప్ప ఎక్కడా కనిపించరని టిఆర్ఎస్ నాయకుడు గట్టు రామచంద్ర రావు వ్యాఖ్యానించగా, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు ఏకంగా లోకేష్‌ను ట్విట్టర్ బాబుగా అభివర్ణించారు. లోకేష్, ఆయన తండ్రి చంద్రబాబుకు తెలంగాణలో ఎవరూ భయపడరని రామచంద్రరావు అన్నారు.
ట్విట్టర్ బాబు లోకేష్‌కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును విమర్శించే స్థాయి లేదని టిఆర్ఎస్ పార్లమెంటు సభ్చుడు బాల్క సుమన్ అన్నారు. రేవంత్‌రెడ్డి జైలు నుంచి విడుదలైతే ర్యాలీలు తీస్తూ స్వీట్లు పంచిన టీడీపీ నేతలకు సిగ్గు లేదని మండిపడ్డారు.

ఏడాది కాలంలో పెద్దపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశామరు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సీఎం కేసీఆర్, ఎంపీలమందరం రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై ఒత్తిడి తెచ్చి రామగుండం, మంచిర్యాలను చేర్చామని చెప్పారు. సింగరేణి కార్మికుల ఆదాయపన్ను మినహాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులందరూ కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ చెప్పిన మార్గాన్నే అనుసరించాలని కోరారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications