మోడీలాగే కెసిఆర్‌కు పరాభవం: జైపాల్, సచిన్ సహా వరంగల్ ప్రచారంలో మాజీలు

వరంగల్: బీహార్‌లో ప్రధాని నరేంద్ర మోడీకి పరాభవం ఎదురైనట్లుగానే వరంగల్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పదని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి గురువారం అన్నారు.

వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన గురువారం మాట్లాడారు. తెలంగాణ దివాళా తీసేలా కెసిఆర్ పాలన ఉందని మండిపడ్డారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు పరాభవం తప్పదని చెప్పారు.

ఉప ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ జాతీయ నేతలు

వరంగల్ ఉప ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలను రంగంలోకి దించనుంది. ఈ నెల 15న భూపాలపల్లి, పరకాలలో దిగ్విజయ్‌ సింగ్, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, 16న వర్థన్నపేటలో మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, 17న స్టేషన్ ఘన్‌పూర్‌లో సచిన్ ఫైలట్‌లు ప్రచారం చేయనున్నారు.

TRS will defeat in Warangal by polls: Jaipal Reddy

సాగునీటి రంగానికి అధిక ప్రధాన్యం: తుమ్మల

మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. రూ.13 కోట్లతో వనపర్తి డబుల్ రోడ్డుకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధన్యం ఇస్తోందని చెప్పారు. వచ్చే బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయిస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లాలో పనులు నడుస్తున్న, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు, కొత్త సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు.

పాలమూరు ఎత్తిపోతలకు త్వరగా భూసేకరణ పూర్తి చేసి మంత్రులు, అధికారులు ఆదర్శంగా నిలిచారన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర ప్రాజెక్టులకు కూడా ఇదే విధంగా భూసేకరణ చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించే ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+