హరీష్ రావుకు కెటిఆర్ కంగ్రాట్స్, బట్టలు ఉతికే నీటినే తాగే స్థితి..: పద్మ ఆవేదన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కెటిఆర్ ట్విట్టర్లో హరీష్‌కు కాంగ్రాట్స్ చెప్పారు.
మెదక్ జిల్లా ప్రజలకు, హరీష్ రావుకు కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 50 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారని ఆయన తన పోస్టుల్లో పేర్కొన్నారు. ఖేడ్‌లో టిఆర్ఎస్ గెలుపు నేపథ్యంలో హైదరాబాదులోని టిఆర్ఎస్ భవన్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. పద్మా దేవేందర్ రెడ్డి డప్పు కొట్టి ఆనందం పంచుకున్నారు.
టిఆర్ఎస్ భవన్లో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది సీఎం కెసిఆర్‌కు పుట్టిన రోజు కానుక అన్నారు. ఇది మామూలు విజయం కాదని, ప్రభంజనమన్నారు. వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలలోను టిఆర్ఎస్ ప్రభుత్వానిదే గెలుపు అన్నారు.

నారాయణఖేడ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఖేడ్ వెనుకబాటుకు కాంగ్రెస్, టిడిపిలే కారణమని చెప్పారు. బట్టలు ఉతికే నీటినే తాగే దుస్థితి నారాయణఖేడ్‌లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి తెరాస చరిత్రను తిరగరాసిందన్నారు.
సంక్షేమ పథకాలే తమను గెలిపించాయని, ఈ గెలుపుతో తమ బాధ్యత పెరిగిందని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. తాము ఖేడ్ ప్రజలకు రుణపడి ఉంటామని ఎంపీ పాటిల్ అన్నారు. ఈ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. ఖేడ్‌లో వలసలను నివారిస్తామని గెలిచిన భూపాల్ రెడ్డి అన్నారు.
కెటిఆర్ మాదిరే హరీశ్ రావు కూడా సత్తా చాటారు. గెలుపు సారథిగా పేరొందిన ఆయన మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికలో తన పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డిని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పటోళ్ల కిష్టారెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను తోసిరాజని తెరాస గెలిచింది.
TRS juggernaut continues to roll unabated. Thumping majority of over 50K in Narayankhed😊. Congrats to @trsharish & Medak TRS leadership team
— KTR (@KTRTRS) February 16, 2016
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications