హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై కన్నేసిన డొనాల్డ్ ట్రంప్- భారీగా విస్తరణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ గత దశాబ్ద కాలంగా భారత్ ను అతిపెద్ద మార్కెట్‌గా పరిగణిస్తోంది. ట్రంప్ ఆర్గనైజేషన్ పలు ప్రముఖ నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ముంబై, పూణే, కోల్‌కతా, గురుగ్రామ్‌లలో ఏడు ప్రాజెక్టుల ద్వారా కనీసం గత ఆర్థిక సంవత్సరంలో 175 కోట్ల రూపాయలను ఆర్జించింది.

ఈ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించుకుంటోంది ట్రంప్ ఆర్గనైజేషన్. 2024 నవంబర్ 5న ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే- తన భారత వ్యాపార భాగస్వామి ట్రైబెకా డెవలపర్‌తో కలిసి గురుగ్రామ్, పూణే, హైదరాబాద్, ముంబై, నోయిడా, బెంగళూరులో ఆరు కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది.. ట్రంప్ ఆర్గనైజేషన్.

Trump Organization announced 6 projects in India including Hyderabad

ఈ ప్రాజెక్టుల ద్వారా ఎనిమిది మిలియన్ చదరపు అడుగుల రియల్ ఎస్టేట్ అభివృద్ధి జరగనుంది. దీని ద్వారా ఆ సంస్థ ఎంత ఆదాయాన్ని పొందుతుందనేది ఇంకా వెల్లడి కాలేదు. ఈ సంవత్సరంలో పూణే, గుర్గావ్, హైదరాబాద్‌లలో మొత్తం 4.3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు ప్రాజెక్టులు ప్రారంభం అయ్యాయి. ఇది ట్రంప్ ఆర్గనైజేషన్ నిర్దేశించుకున్న టార్గెట్ లో సగానికి పైమాటే.

2012లో భారత్ లో అడుగు పెట్టిందీ సంస్థ. అప్పటి నుండి.. మొత్తం 11 మిలియన్ చదరపు అడుగుల మేర రియల్ ఎస్టేట్ నిర్మాణాలను పూర్తి చేసుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరం నాటికి అభివృద్ధి చేసిన మూడు మిలియన్ చదరపు అడుగులతో పోల్చుకుంటే నాలుగు రెట్లు ఎక్కువ. రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాతే.. ట్రంప్ ఆర్గనైజేషన్ కార్యకలాపాలు వేగం పుంజుకొన్నాయి.

ఈ కొత్త ప్రాజెక్టుల విక్రయాల సామర్థ్యం కనీసం 15,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ సంవత్సరం మార్చిలో పూణేలో తమ మొదటి వాణిజ్య అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు ట్రైబెకా ఈ విషయాన్ని వెల్లడించింది. నిర్మాణ వ్యవహారాల్లో ట్రంప్ ఆర్గనైజేషన్ నేరుగా పెట్టుబడి పెట్టదు గానీ.. బ్రాండ్ లైసెన్స్ ఫీజులు లేదా డెవలప్‌మెంట్ ఫీజుల ద్వారా ఆదాయాన్ని పొందుతుంది.

ఈ ఫీజులు నిర్మాణంపై ఆధారపడి ఉంటాయి లేదా ప్రాజెక్ట్ విక్రయాలలో 3-5 శాతం వాటా రూపంలో ఉంటాయి. ఈ ఆస్తులు సాధారణంగా లగ్జరీ డెవలప్‌మెంట్‌లుగా ప్రచారం చేస్తుంది ట్రైబెకా సంస్థ. డొనాల్డ్ ట్రంప్ పేరును ఉపయోగించుకుంటుంది. ఫలితంగా వాటికి ఎక్కువ డిమాండ్ ఏర్పడుతుంది.

భారత్ లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఎక్కువ శాతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), లోధా గ్రూప్, ఎం3ఎం, బ్రిగేడ్ డెవలపర్స్, పంచశీల్ రియల్టీ, ఐఆర్ఏ ఇన్‌ఫ్రా, యూనిమార్క్ వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు అమలు చేస్తున్నాయి. కల్పేష్ మెహతా నేతృత్వంలోని ట్రైబెకా డెవలపర్స్ భారత్ లో ట్రంప్ ఆర్గనైజేషన్ అధికారిక భాగస్వామి.

న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తోంది ట్రంప్ ఆర్గనైజేషన్. వివిధ వ్యాపార సంస్థలకు ప్రధాన హోల్డింగ్ కంపెనీగా పనిచేస్తోంది. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ వంటి అనేక పరిశ్రమలలో విస్తరించి ఉన్న అనుబంధ సంస్థల ద్వారా ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

డొనాల్డ్ ట్రంప్ దీన్ని తన పేరు మీద స్థాపించారు. మెజారిటీ వాటా కూడా ఆయనదే. ఆయన కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా ఉన్నారు. 2017 జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ట్రంప్ ఈ సంస్థ ఛైర్మన్ గా వ్యవహరించారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన కుమారులకు ఈ బాధ్యతలను అప్పగించారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన కొద్ది రోజులకే, ట్రంప్ ఆర్గనైజేషన్ 2024 నవంబర్ 14న భారతదేశంలో ట్రంప్ బ్రాండ్ పేరును లైసెన్స్ చేయడానికి నాలుగు కంపెనీలను ప్రారంభించింది.

డీటీ మార్క్స్ నోయిడా 94 ఎల్ఎల్సీ, డీటీ మార్క్స్ గుర్గావ్ 111 ఎల్ఎల్సీ, డీటీ మార్క్స్ గుర్గావ్ 69 ఎల్ఎల్సీ, డీటీ మార్క్స్ పూణే ముంధ్వా ఎల్ఎల్సీ. అమెరికా ఎన్నికలకు ఒక నెల ముందు అంటే అక్టోబర్ 16వ తేదీన డీటీ మార్క్స్ హైదరాబాద్ ఎల్ఎల్సీనీ ఆయన స్థాపించారు. 2024లో కూడా ట్రంప్ ఆర్గనైజేషన్ భారత్ నుండి 12 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.

ట్రైబెకా వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా, యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్టన్ స్కూల్ పూర్వ విద్యార్థి. గత నవంబర్‌లో హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, వార్టన్ పూర్వ విద్యార్థి అయిన ట్రంప్ ను ఒక ప్రొఫెసర్ ద్వారా పరిచయం చేశారని, ఆ పరిచయమే ఈ ఒప్పందానికి దారితీసిందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+