తెలంగాణకు కేసీఆర్, ఏపీకి ఎన్టీఆర్.. అమెరికాకు ట్రంప్: వర్మ

హైదరాబాద్: వివాదాస్పద విమర్శలు చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌కు తెలుగు రాష్ట్రాల నేతలతో లింక్ పెట్టి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో మంగళవారం నాడు ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఎలాగో, ఆంధ్రప్రదేశ్‌కు ఎన్టీఆర్ ఎలాగో.. అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అలా అని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్‌ను ఎన్నుకొని అమెరికన్లు కూడా తమలో ఇండియన్స్ మనస్తత్వం ఉందని ప్రూవ్ చేసుకున్నారన్నారు.

Trump will be to America what KCR is to TS and what NTR was to AP: Varma

తెలివైన బరాక్ ఒబామా మౌనం కన్నా, ట్రంప్ పూలిష్ నెస్ ఎంతో ఉన్నతమైనదని ట్వీట్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని కావాలని ప్రార్థిస్తున్నానని, ఎందుకంటే ట్రంప్, కేజ్రీవాల్‌లు వైట్ హౌస్‌లో కలుసుకోవడం చూడాలన్నది తన కోరిక అన్నారు.

కాగా, సినిమా హీరోయిన్లు రాజకీయాల్లోకి రావడం తనకు ఆనందంగా ఉందని, తొలిసారి బీజేపీ తరఫున అస్సోం ఎమ్మెల్యేగా గెలిచిన అంగూర్ లతాదేవిని ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు తొలిసారి రాజకీయాలపై ఆసక్తి కలిగిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+