• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీలోకి విజయశాంతి ఎంట్రీ ఖాయమా? చేరికపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

|

తెలంగాణ కాంగ్రెస్ తురుపుముక్క, నటి విజయశాంతి రాజకీయ భవిష్యత్తుపై కొంతకాలంగా సాగుతోన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్ది నెలలుగా కాంగ్రెస్ తో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ, పార్టీ పేరును ప్రస్తావించకుండానే ప్రకనటలు చేస్తోన్న విజయశాంతి.. బీజేపీలో చేరతారంటూ చర్చ జరుగుతున్న సంగతి లిసిందే. ఈ నేపథ్యంలో..

జడ్జికే జైలు, జగన్ తప్పించుకోలేరు -అటార్నీ చెప్పిందిదే -పీపీఏను బెదిరిస్తే పైసలొస్తాయా?: రఘురామ

బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎంపీటీసీ, కాంగ్రెస్ నేత తోట సంధ్య అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేరికల సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. విజయశాంతి అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న విజయశాంతి పార్టీ మారబోరని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా ఆ పార్టీ నేతలు తేల్చి చెప్పినప్పటికీ నేరుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే స్పందించడంతో విజయశాంతి పార్టీ మార్పుపై ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

 రాములమ్మపై పొగడ్తలు..

రాములమ్మపై పొగడ్తలు..

రాములమ్మగానూ ప్రాచుర్యం పొందిన విజయశాంతిని బీజేపీ చీఫ్ బండి సంజయ్ పొగడ్తలతో ముంచెత్తారు. విజయశాంతి ప్రజాదరణ ఉన్న నాయకురాలని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. తెలంగాణ గ్రామాల్లో ప్రజలను ఆమె చైతన్యం చేశారన్నారు. నాయకుడిగా చెప్పుకున్న కేసీఆర్ ఉద్యమం సమయంలో ఇంట్లో పడుకుండిపోతే.. ఉద్యమ భారాన్నంతా విజయశాంతి నెత్తికెత్తుకుని, పార్లమెంటులో పోరాటం చేశారని సంజయ్ వివరించారు. అంతేకాదు..

 విజయశాంతికి బీజేపీలో పదవి..

విజయశాంతికి బీజేపీలో పదవి..

తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన విజయశాంతిని.. రాష్ట్రం వచ్చిన తర్వాత పార్టీలు నిర్లక్ష్యం చేశాయని సంజయ్ ఆవేదన చెందారు. బీజేపీలోకి విజయశాంతి ఎప్పుడు చేరబోయేది తెలియదని, ఒకవేళ పార్టీలో చేరితే ఆమెకు ఇవ్వబోయే పదవి, ప్రాధాన్యం ఏమిటనేది అప్పుడే వెల్లడిస్తామని సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో పైస్థాయి నేతల పట్ల కిందిస్థాయిలో విపరీతమైన అసంతృప్తి ఉందని, కోవర్టులు కూడా ఉన్నారని, విజయశాంతి మాత్రం మంచి నాయకురాలని ఆయన పేర్కొన్నారు.

సంచలనం: అమెరికా తొలి మహిళా ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ - నెలరోజుల్లోనే చూస్తారన్న ట్రంప్

English summary
mid speculation over congress leader vijayashanti joining in to bjp, telangana bjp chief bandi sanjay kumar made crucial comments. bandi sanjay praises vijayashanthi role in telangana movement. if she willing to join bjp, we would welcome, says ts bjp chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X