తెలంగాణలో కొత్తగా 7 మెడికల్ కాలేజీలు -వ్యాక్సిన్లపై కీలక ప్రకటన -లాక్‌డౌన్ సహా కేబినెట్ నిర్ణయాలివే
కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ను మరో 10 రోజులపాటు, అంటే జూన్ 1 వరకు పొడగించిన కేసీఆర్ సర్కారు.. రాష్ట్రంలో వైద్య సదుపాయాల కల్పన, వ్యాక్సినేషన్ ప్రక్రియపైనా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆదివారం సాయంత్ర సుదీర్ఘంగా 5 గంటలపాటు సాగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు పలు అంశాలకు ఆమోదం లభించింది...
రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు తెలంగాణ కేబినేట్ ఆమోదం తెలిపింది. మహబూబాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు కేవలం నాలుగు మెడికల్ కాలేజీలే ఉన్నాయని, 2014- 18 మధ్య కొత్తగా ఐదు కాలేజీలను ఏర్పాటు చేశామని, ఇప్పుడు మరో ఏడింటిని ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక

వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లకు వెళుతోన్న తెలంగాణ.. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న టీకాలను జర్నలిస్టులు, వ్యాపారులకు ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాదు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా టీకాల విషయంలో ప్రాధాన్యత ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వ్యాక్సినేష్ ప్రక్రియకు సంబంధించి త్వరలో మార్గ దర్శకాలు విడుదల కానున్నాయి.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం 5 గంటల పాటు కొనసాగింది. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్లకు కేబినెట్ అనుమతించింది. లాక్ డౌన్ సడలింపు సమయాల్లో ఈ కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించింది. వ్యవసాయ రంగంపై కూడా కేబినెట్ చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. గతంలో నాలుగు గంటలు మాత్రమే ఉన్న సడలింపును ఇప్పుడు ఏడు గంటలకు పెంచారు. అంటే, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications