Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ బీజేపీ పంజరంలో చిలుక.. బండి సంజయ్ నాటకాలు కట్టిపెట్టు .. రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు

తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరచుపడ్డారు. ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే 317 జీవోను తెచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో చీలిక తెచ్చారని దుయ్యబట్టారు. చెరో వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఆరోపణలు గుప్పించారు.

టీఆర్ఎస్ స‌ర్కార్ తప్పు చేస్తుందంటే .. ఆ తప్పు కేంద్రానిది కూడా..

టీఆర్ఎస్ స‌ర్కార్ తప్పు చేస్తుందంటే .. ఆ తప్పు కేంద్రానిది కూడా..

రాష్ట్రపతి ఆమోదించిన ఉత్తర్వుల ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులను బదిలీలు చేస్తోందన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన దస్త్రాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. కేంద్రం ఆమోదించిన తర్వాతే 317 జీవో వచ్చింది. 317 జీవోలో తప్పు ఉంటే దాని ఆమోదించింది కేంద్రమే కదా అనిప్రశ్నించారు. కేసీఆర్ పంపిన తప్పుడు ప్రతిపాదనలకు కేంద్రం గుడ్డిగా ఒకే చెప్పిందా అని నిలదీశారు. 317 జీవోను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తుందంటే .. ఆ తప్పుకు కేంద్రం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్ర‌భుత్వ ఉద్యోగుల జీవితాల‌తో ఆట‌లా..?

ప్ర‌భుత్వ ఉద్యోగుల జీవితాల‌తో ఆట‌లా..?

బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 317 జీవోతో లక్షాది ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జీవోను సవరించాలంటే కేంద్రానికి పెద్ద కష్టమైన పని కాదని పేర్కొన్నారు. ఒక్క ఫిర్యాదుతో జీవోలు మార్పులు తీసుకొచ్చేలా చర్యలు తీసుకొచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు 317 జీవోను సవరించాలని బీజేపీ దొంగ పోరాటాలు చేస్తుందని విమర్శించారు. కేంద్రంలో అధికారం మీ చేతుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏమి చేయలేకపోతే .. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటున్న మీరు ఏం చేస్తారని ప్రశ్నించారు.

కేసీఆర్ బీజేపీ పంజరంలో చిలుక

కేసీఆర్ బీజేపీ పంజరంలో చిలుక

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మోదీ చేప్పే చిలక పలుకులే ఈయన కూడా పలుకుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ బీజేపీ పంజరంలో ఉన్న చిలుక అని సైటైర్లు వేశారు. సీఎం కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించాలని ప్రగల్భాలు పులుకుతుంటారు. మరి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీపై పోరాడుతున్న అఖిలేష్ యాదవ్ కు కేసీఆర్ మద్దతిస్తారా అని ప్రశ్నించారు.

బండి సంజ‌య్ రాత్రి నిద్ర చేస్తే కేసీఆర్‌కు అభ్యంత‌రం ఎందుకు?

బండి సంజ‌య్ రాత్రి నిద్ర చేస్తే కేసీఆర్‌కు అభ్యంత‌రం ఎందుకు?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌వారి పార్టీ కార్యాలయంలోనే రాత్రి నిద్ర చేస్తే కేసీఆర్ కు అభ్యంతరమేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై లేనిపోని డ్రామాలు దేనికి అని దుయ్యబట్టారు. కేవలం 24 గంటల్లో ముగిసిపోయే తతంగానికి 10 రోజులుగా సాగదీస్తూ కొత్త నాటకాలు దేనికని దుయ్యబట్టారు. బండి సంజయ్ దీక్షకు లేని గొప్పదనాన్ని కేసీఆర్ తెచ్చారని విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ ఏం సాధించారని ఇతర రాష్ట్రాల ముఖమ్యంత్రులు జాతరలో గంగిరెద్దోళ్లు వచ్చినట్లు తెలంగాణకు క్యూ కడుతున్నారని విమర్శించారు..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+