టీఎస్ ఎంసెట్ హాల్ టిక్కెట్లు నేడు విడుదల, ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి

హైదరాబాద్/న్యూఢిల్లీ: జవహర్ లాల్ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్ తెలంగాణ ఎంసెట్ హాల్ టిక్కెట్లు శుక్రవారం విడుదల చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, అగ్రికల్చర్ విద్యా కోర్సుల్లో ప్రవేశించేందుకు నిర్వహించే తెలంగాణ ఎంసెట్ 2018కు సంబంధించి హాల్ టిక్కెట్లు విడుదలవుతాయి.

అధికారిక వెబ్ సైట్ eamcet.tsche.ac.in లో అందుబాటులో ఉంటాయి. తెలంగాణ ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను మే 1వ తేదీ వరకు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

TS EAMCET 2018 hall ticket releases today; check and download from eamcet.tsche.ac.in

ఇప్పటి వరకు ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ నెల 24వ తేదీ లోపు రూ.5000 ఆలస్య రుసుముతో పరీక్షకు హాజరు కావొచ్చు. మే 2, మే 3 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్షను నిర్వహిస్తారు.

ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్ష మే 4, మే 5, మే 7 తేదీల్లో నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి తెలంగాణ ఎంసెట్ 2018 హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+