Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాహన దారులకు గుడ్ న్యూస్ - పెండింగ్ చలానాలపై భారీ రాయితీ..!!

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పోలీసుశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెండింగ్ చలాన్లను త్వరగా చెల్లించేందుకు వాహనదారులకు రాష్ట్ర పోలీసులు బారీ రాయితీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీసులు ముందుకు వచ్చారు. ఈనెల 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లు డిస్కౌంట్‌తో కట్టవచ్చని తెలిపింది.

తెలంగాణలో వాహనదారులకు పెండిగ్ చలానాలు కట్టేందుకు ప్రభుత్వం భారీ వెసులుబాటు కల్పించింది. భారీ రాయితీ ప్రకటన చేసింది. ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్, టూవీలర్ చలాన్లకు 80 శాతం డిస్కౌంట్, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కి 50 శాతం డిస్కౌంట్‌ ఇచ్చారు. ఆన్‌లైన్‌తో పాటు మీసేవ సెంటర్స్‌లో డిస్కౌంట్‌లో చలాన్స్ పేమెంట్ చేసే అవకాశాన్ని పోలీస్ శాఖ కల్పించింది. 2022లో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 300 కోట్ల చలాన్స్ వసూలు అయ్యాయి.

TS Government Announces subsidised rates for pending challan payments, see details

ఆ తర్వాత జనరేట్ అయిన చలాన్లకు డబ్బులు సరిగా వసూలు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. చలాన్లు భారీగా పెరిగిపోతుండడంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు డిస్కౌంట్ చలానాల చెల్లింపుకు అవకాశం కల్పించారు. 2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్ ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు.

వీటిపై అనూహ్య స్పందన వచ్చింది. కేవలం 45 రోజుల వ్యవధిలో రూ 300 కోట్ల వరకు వసూలు అయ్యాయి. దాదాపు 65 శాతం చలానాలు చెల్లించారు. ఆ తరువాత మళ్లీ పెండింగ్ భారం పెరిగిపోతోతంది. గత నెలాఖరుకు చలానాల సంఖ్య మళ్లీ రెండు కోట్లకు చేరినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి రాయితీ ప్రకటించారు. నిర్ణీత వ్యవధిలో చలానాలు చెల్లించన వారికే ఈ రాయితీ వర్తిస్తుంది. తెలంగాణ పోలీసు శాఖ లోని ఈ చలాన్ వెబ్ సైట్ ద్వారా ఏ వాహన దారుడి పైన ఏ మేర చలానా పెండింగ్ లో ఉందనే సమాచారం తెలుసుకొనే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+