రూ 13 వేల కోట్ల అప్పు సేకరణకు రేవంత్ సర్కార్ నిర్ణయం..!!

తెలంగాణ ప్రభుత్వం కొత్త అప్పులకు సిద్దమైంది. ఈ నెల 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు..రాష్ట్ర అర్దిక పరిస్థితి గురించి ప్రభుత్వం శాసనసభలో శ్వేత పత్రం ప్రకటించింది. రేవంత్ సర్కార్ ఏర్పాటు అయిన తరువాత ఇప్పటి వరకు రూ 1,400 కోట్లు రుణంగా తీసుకుంది. కాగా.. వచ్చే మూడు నెలల కాలంలో తీసుకొనే అప్పుల పైన ఆర్బీఐకి ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది.

ఆర్బీఐ నుంచి అప్పు: తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రుణ సేకరణకు నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి ఈ మేరకు ఆర్బీఐకి ప్రతిపాదనలు చేరాయి. రాబోయే 3 నెలల కాలానికి ఆర్బీఐ నుంచి రూ.13 వేల కోట్ల అప్పు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకోనున్న రుణాల వివరాల నివేదికను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం 3 నెలల కాలానికి రూ.13 వేల కోట్ల రుణం తీసుకోనున్నది.

TS Government to take Rs 13 Thousand Cr loan from RBI in next Three months as Reports

తొలి నెలలో రూ 1,400 కోట్లు: దీనికి కొనసాగింపుగా జనవరి 9న రూ.1,000 కోట్లు, 16న రూ.2,000 కోట్లు, 30న రూ.1,000 కోట్లు మొత్తంగా జనవరిలో రూ.4,000 కోట్లను తీసుకోనుంది. ఫిబ్రవరిలో మొత్తంగా రూ.3,000 కోట్ల రుణం తీసుకోనుండగా, అందులో 13, 20, 27 తేదీల్లో రూ.1,000 కోట్ల చొప్పున తీసుకోనున్నది. మార్చి నెలకు గానూ 5న రూ.2,000 కోట్లు, 12న రూ.1,000 కోట్లు, 19న రూ.2,000 కోట్లు, 26న రూ.1,000 కోట్లు మొత్తంగా 4 విడతల్లో రూ.6 వేల కోట్లు అప్పు సేకరణ దిశగా కార్యాచరణ నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీఐ నుంచి రూ.1,400 కోట్ల రుణం తీసుకున్నది.

మూడు నెలలు - రూ 13 వేల కోట్లు: కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్‌ 7న ఏర్పడగా, 5 రోజుల అనంతరమే (డిసెంబర్‌ 12న) ఆర్బీఐ వద్ద రూ.500 కోట్ల అప్పు చేసింది. అనంతరం డిసెంబర్‌ 19న మరోసారి రూ.900 కోట్లు రుణంగా తీసుకుంది. తెలంగాణ మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు రుణ సేకరణ చేస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిక ప్రాంతాలు వచ్చ మూడు నెలల కాలంలో దాదాపుగా రూ 4,13,450 కోట్ల మేరు రణ సేకరణకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇచ్చిన హామీల అమలు వేళ తెలంగాణ ప్రభుత్వానికి ఆర్దిక నిర్వహణ సవాల్ గా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+