స్కూళ్లకు జనవరి1, సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!!
కొత్త సంవత్సరం ప్రారంభ జోష్ మొదలైంది. ఈ సారి జనవరి 1న ప్రభుత్వం సాధారణ సెలవుగా ప్రకటించింది. ఈ సెలవు పాఠశాలలకు వర్తిస్తుందా లేదా అనే చర్చ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. తెలంగాణలో ని పాఠశాలలకు సైతం జనవరి 1 సెలవుగా ప్రకటించారు. ఇదే సమయంలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. కొత్త సంవత్సర వేడుకల పైన ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. ట్రాఫిక్ నిబంధనలను అమలు చేస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా జనవరి 1వ తేదీన పాఠశాలలకు సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన సెలవు ఇస్తున్నట్టు తెలిపింది. జనవరి 1వ తేదీన జనరల్ హాలీడేగా గుర్తించింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి రెండవ శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ రోజు (డిసెంబర్ 31) రాత్రి 1 గంట వరకు వేడుకలు జరుపుకోవడానికి అనుమతించనున్నట్లు తెలిపింది. పబ్ లు, క్లబ్ లు, బార్, రెస్టారెంట్లు, హోటళ్లు ఒంటి గంట వరకు తెరచుకునేందుకు అనుమతించనుంది. అయితే, ముందస్తు అనుమతి తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా 14వ తేదీ, 15వ తేదీన సెలవులు ఉన్నాయి. గణతంత్రి దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీన సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 14వ తేదీన భోగి, 15వ తేదీన సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది. 16వ తేదీన కనుముకు ఆప్షనల్ హాలీడేను పేర్కొంది. రాష్ట్రంలో స్కూల్స్ పదో తరగతి పరీక్షల కోసం సిద్ధం అవుతున్నాయి. శనివారం విద్యా శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం పదో తరగతి పరీక్షలు మార్చి 18వ తేదీన మొదలవుతాయి. ఏప్రిల్ 2వ తేదీన ముగుస్తాయి. కొత్త సంవత్సరం వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసు అధికారులు ప్రజలకు సూచించారు.












Click it and Unblock the Notifications